Ponniyin Selvan 2 Collections: భారీగా తగ్గిన వసూళ్లు.. తెలుగులో అంతే.. హిట్ కావాలంటే మాత్రం!

చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి అగ్ర తారలు నటించిన చిత్రమే పొన్నియన్ సెల్వన్ 2. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం రెండో పార్ట్ గా విడుదలైంది. తొలి రోజు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకుపోతోంది. ఫలితంగా కోట్లలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2కి 6వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

పీరియాడిక్ డ్రామా:రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీ సినిమాలకు పేరొందిన తమిళ దర్శకుడు మణిరత్నం. గతేడాది ఆయన తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ మూవీనే పొన్నియన్ సెల్వన్. తాజాగా దీనికి సెకండ్ పార్ట్ ఏప్రిల్ 28న విడుదల ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఫలితంగా వసూళ్లు భారీగా నమోదు అవుతున్నాయి.

Ponniyin Selvan Part 2 6 Days Worldwide Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్:మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2. ఈ సినిమాను సుమారుగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళనాడులో 600 థియేటర్లతో కలుపుకుని వరల్డ్ వైడ్ గా 2800 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక పొన్నియన్ సెల్వన్ 2కి రూ. 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగింది. రూ. 172 కోట్లుగా బ్రేక్ ఈవెన్ ఫిక్స్ అయింది.

Ponniyin Selvan Part 2 6 Days Worldwide Box Office Collection

తెలుగు రాష్ట్రాల్లో :ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2కి తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలుపుకును మొత్తంగా రూ. 22 లక్షలు మాత్రమే వసూళు అయింది. ఇక 6 రోజుల్లో నైజాంలో రూ. 3.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 51 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 50 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 36 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో మొత్తంగా రూ. 5.92 కోట్లు షేర్, రూ. 12.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Ponniyin Selvan Part 2 6 Days Worldwide Box Office Collection

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే? :క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 5.92 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.58 కోట్లు వసూలు అయితేనే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.

Ponniyin Selvan Part 2 6 Days Worldwide Box Office Collection

ప్రపంచవ్యాప్తంగా.. హిట్ కావాలంటే?: 'పొన్నియన్ సెల్వన్ 2'కు 6 రోజులకు కలిపి తెలుగులో రూ. 12.15 కోట్లు, తమిళంలో రూ. 79.65 కోట్లు, కర్నాటకలో రూ. 14.55 కోట్లు, కేరళలో రూ. 11.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 15.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 106.75 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 239.75 కోట్లు గ్రాస్‌, రూ. 115.70 కోట్లు షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ. 56.30 కోట్లు కలెక్ట్ చేయాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X