Ponniyin Selvan 2 day 1 Collections బాక్సాఫీస్ వద్ద మణిరత్నం మ్యాజిక్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే!

భారత దేశ చరిత్రలో చోళులు, పాండ్యుల పరిపాలనలో చోటుచేసుకొన్న రాజకీయాలు, పగలు, ప్రతీకారాలు నేపథ్యంగా సంచలన దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన ఈ చిత్రం అన్ని భాషల్లోను మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది.

పాజిటివ్ రివ్యూలతో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ నమోదు చేస్తున్నది. విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, శోభిత ధూళిపాల, లక్ష్మీ ఐశ్వర్య, జయం రవి నటించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

Ponniyin Selvan Part 2 day 1 expected Collections worldwide

పొన్నియన్ సెల్వన్ 2 బడ్జెట్, స్క్రీన్ కౌంట్: పొన్నియన్ సెల్వన్ చిత్రం రెండు పార్టులకు కలిపి భారీగా ఖర్చు పెట్టారు. ఈ సినిమాను దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. పార్ట్ 2 బడ్జెట్‌కు 250 కోట్లుగా భావించవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక చిత్రాన్ని తమిళనాడులో 600 స్కీన్లలో, కేరళలో 200 స్క్రీన్లలో, ఆంధ్రా, తెలంగాణలో 340 స్క్రీన్లలో, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 860 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Ponniyin Selvan Part 2 day 1 expected Collections worldwide

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?: ఇక పొన్నియన్ సెల్వన్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తమిళనాడులో 80 కోట్ల మేర వ్యాల్యూ చేయగా, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మేర, కేరళ థియేట్రికల్ హక్కులు 9 కోట్లు, హిందీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 21 కోట్లు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా హక్కులు ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Ponniyin Selvan Part 2 day 1 expected Collections worldwide

తమిళం, హిందీలో ఆక్యుపెన్సీ: పొన్నియన్ సెల్వన్ 2 మూవీ తమిళనాడులో అక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం 60 శాతం ఆక్యుపెన్సీ, ఫస్ట్ షోకు 62 శాతం, సెకండ్ షోకు 60 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక హిందీలో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఉత్తరాదిలో హిందీ వెర్షన్‌కు సంబంధించి అన్ని షోలు కూడా కేవలం 10 శాతంతో సరిపెట్టుకొన్నాయి.

Ponniyin Selvan Part 2 day 1 expected Collections worldwide

తెలుగు, మలయాళం, కన్నడలో: ఇక పొన్నియన్ సెల్వన్ 2 మూవీ మలయాళం వెర్సన్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 22 శాతం, మ్యాట్నీకి 30 శాతం, ఫస్ట్ షోకు 36 శాతం, సెకండ్ షోకు 30 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. మార్నింగ్ షోకు 25 శాతం, మధ్యాహ్నం 32 శాతం, ఫస్ట్ షోకు 30 శాతం, సెకండ్ షోకు 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. కన్నడలో 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Ponniyin Selvan Part 2 day 1 expected Collections worldwide

పొన్నియన్ సెల్వన్ తొలి రోజు కలెక్షన్ల అంచనా: పొన్నియన్ సెల్వన్ తొలి రోజు బాక్సాఫీస్ రిపోర్టు వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ఈ చిత్రం 26 కోట్ల గ్రాస్ కలెక్షన్లను, ఓవర్సీస్‌లో 30 కోట్ల గ్రాస్, తెలుగులో 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియా వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. పొన్నియన్ సెల్వన్ చి్తరం 35 కోట్ల గ్రాస్, 29 కోట్ల షేర్ వసూలు చేస్తుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 65 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X