Ponniyin Selvan 2 Collections: తమిళ బాహబలి వసూళ్ల సునామీ.. 200 కోట్లకు దగ్గర్లో.. 3వ రోజు ఎంతంటే?

తమిళ అగ్ర దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మంచి విజయం సాధించింది. దీంతో ఆయన రెండో పార్టును కూడా తెరకెక్కించిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమాకు మూడో రోజు కలెక్ట్ అయిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

నిర్మాతలు.. నటీనటులు:స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పిరియాడిక్ యాక్షన్ మూవీ 'పొన్నియన్ సెల్వన్ 2'లో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ సినిమాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై మణిరత్నం, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Ponniyin Selvan Part 2 Day 3 Expected Worldwide Box Office Collection

బడ్జెట్.. ప్రీ రిలీజ్ బిజినెస్:మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1కు కొనసాగింపే పార్ట్ 2. ఈ సినిమాను దాదాపుగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళనాడులో 600 థియేటర్లతో కలుపుకుని వరల్డ్ వైడ్ గా 2800 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక పొన్నియన్ సెల్వన్ 2కి రూ. 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగింది. రూ. 172 కోట్లుగా బ్రేక్ ఈవెన్ ఫిక్స్ అయింది.

Ponniyin Selvan Part 2 Day 3 Expected Worldwide Box Office Collection

ఆక్యుపెన్సీ వివరాలు :పొన్నియన్ సెల్వన్ 2 చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీనికి మూడో రోజున ఆక్యపెన్సీ బాగానే నమోదు అయింది. తమిళంలో ఉదయం 53.11%, మధ్యాహ్నాం 66.82% నమోదు కాగా తెలుగులో ఉదయం 19.48%, మధ్యాహ్నాం 36.53%, హిందీలో ఉదయం 12.35%, మధ్యాహ్నాం 21.01 % రికార్డ్ అయింది. అంటే తమిళంతో పోల్చుకుంటే తెలుగు, హిందీ ఆక్యుపెన్సీలో చాలా తేడా కనిపిస్తోంది.

Ponniyin Selvan Part 2 Day 3 Expected Worldwide Box Office Collection

3వ రోజు కలెక్షన్స్:మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2కి మొదటి రోజున రూ. 24 కోట్లు, రెండో రోజున రూ. 2.3 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా తొలి రోజు రూ. 28.85 కోట్లు షేర్, రెండో రోజు రూ. 24.40 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. ఈ క్రమంలో మూడో రోజున రూ. 28 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Ponniyin Selvan Part 2 Day 3 Expected Worldwide Box Office Collection

3 రోజుల వసూళ్లు:పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ తో భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికీ రెండు రోజుల్లో రూ. 109.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక మూడు రోజుల ఇండియా నెట్ కలెక్షన్స్ అయితే రూ. 78.20 కోట్లుగా ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నాయి. అంటే మరో రెండు రోజుల్లో రూ. 200 కోట్లు కొల్లగొట్టి క్లబ్ లో చేరేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X