Ponniyin Selvan 2 Collections: సోమవారం రోజు కూడా అదే దూకుడు.. తెలుగులో పరిస్థితి ఎలా ఉందంటే?
తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న ప్రముఖ దర్శకులలో మణిరత్నం ఒకరు. ఇక ఆయన దర్శకత్వం వహించిన చారిత్రాత్మక సినిమా పొన్నియిన్ సెల్వన్ 2 రెండవ భాగం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తమిళంలో తప్పితే మిగతా భాషల్లో పెద్దగా పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ చేయలేదు.
పర్వాలేదు అనే విధంగా రివ్యూలు వచ్చాయి. కొన్ని ఏరియాలలో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇక ఈ సినిమా వీకెండ్ తర్వాత సోమవారం నుంచి అసలు పరీక్షను ఎదుర్కొంటుంది. ఇక నాలుగవ రోజు ఏ స్థాయిలో కలెక్షన్ వచ్చాయి.. అనే వివరాల్లోకి వెళితే..

అంచనాలకు తగ్గట్టుగా బిజినెస్: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మంచి విజయం అందుకున్న అనంతరం మణిరత్నం రెండో పార్టును కూడా గ్రాండ్ గా తెరకెక్కించి ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రూపొందింది. రెస్పాన్స్ వస్తోంది.
చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాను దాదాపుగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. తమిళనాడులో 600 థియేటర్లతో కలుపుకుని వరల్డ్ వైడ్ గా 2800 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక పొన్నియన్ సెల్వన్ 2కి రూ. 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

ఆక్యుపెన్సీ వివరాలు: పొన్నియన్ సెల్వన్ రెండవ భాగం మిక్స్ డ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో కొనసాగుతోంది. చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీనికి 4వ రోజున ఈ విధంగా ఆక్యపెన్సీ నమోదు అయింది.
తమిళంలో ఉదయం 51.11%, మధ్యాహ్నాం 66.82% నమోదు కాగా తెలుగులో ఉదయం 19.48%, మధ్యాహ్నాం 36.53%, హిందీలో ఉదయం 12.35%, మధ్యాహ్నాం 21.01 % రికార్డ్ అయింది. అంటే తమిళంతో పోల్చుకుంటే తెలుగు, హిందీ ఆక్యుపెన్సీలో చాలా తేడా కనిపిస్తోంది.

4వ రోజు కలెక్షన్స్: ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2కి మొదటి రోజున రూ. 24 కోట్లు, రెండో రోజున రూ. 2.3 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా తొలి రోజు రూ. 28.85 కోట్లు షేర్, రెండో రోజు రూ. 24.40 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. ఈ క్రమంలో మూడో రోజున రూ. 28 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించింది. 4వ రోజు అంచనాల ప్రకారం 23 కోట్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
4 రోజుల టోటల్ కలెక్షన్స్: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా విడుదలైన రోజు తమిళంలో పాజిటివ్ టాక్ తో భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రెండు రోజుల్లో సినిమా రూ. 109.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సౌత్ ఇండియా బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 4 రోజుల ఇండియా నెట్ కలెక్షన్స్ అయితే రూ. 103 కోట్లుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తప్పకుండా సినిమా ఈ వారం కూడా మరింత ఎక్కువ కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది.

తెలుగులో పరిస్థితి ఎలా ఉందంటే:PS 2 మొదటి భాగం తెలుగులో పరవాలేదు అనే విధంగానే కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు రెండవ భాగం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది. ఇక 10.5 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే ఈ సినిమా సక్సెస్ అయినట్లు లెక్క.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా నాలుగు రోజుల్లో దాదాపు 5 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక సినిమా మరో ఐదు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. మరి ఈ సినిమా ఆ టార్గెట్ ను ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











