Ponniyin Selvan 2 Collections: ఐదవ రోజు ఊహించని షాక్.. తెలుగులో ఇంకా ఎంత రావాలంటే?

దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న ప్రముఖ దర్శకుడు మణిరత్నం మొత్తానికి తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం మంచి క్రేజ్ అందుకుంది. ఇక రెండవ భాగం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తమిళంలోనే కాకుండా మిగతా భాషల్లో మంచి టాక్ సోంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో అందుకోలేదు. కానీ తమిళంలో మాత్రం బెస్ట్ ఒపెనింగ్స్ వచ్చాయి. సోమవారం నుంచి సినిమా కలెక్షన్స్ తగ్గినప్పటికీ మంగళవారం పరవాలేదు అనే విధంగా వచ్చాయి. ఇక 5వ రోజు ఏ స్థాయిలో కలెక్షన్ వచ్చాయి.. అనే వివరాల్లోకి వెళితే..

అంచనాలకు తగ్గట్టుగా బిజినెస్ : పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 తమిళనాడులో అత్యదిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో అనంతరం మణిరత్నం రెండో పార్టును కూడా గ్రాండ్ గా తెరపైకి తీసుకు వచ్చాడు. ఇక ఆ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు ఈ సినిమాలో అద్భుతమైన పాత్రల్లో నటించారు. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా తమిళనాడులో 600 థియేటర్లతో కలుపుకుని వరల్డ్ వైడ్ గా 2800 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక పొన్నియన్ సెల్వన్ 2కి రూ. 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగినట్లు సమాచారం.

 Ponniyin Selvan 2 Collections

ఆక్యుపెన్సీ వివరాలు : పొన్నియన్ సెల్వన్ 2 మిక్స్ డ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు 5వ రోజున ఈ విధంగా ఆక్యపెన్సీ నమోదు అయింది. తమిళంలో ఉదయం 22.11%, మధ్యాహ్నాం 36.82% నమోదు కాగా తెలుగులో ఉదయం 19.48%, మధ్యాహ్నాం 36.53%, హిందీలో ఉదయం 37.35%, మధ్యాహ్నాం 21.01 % రికార్డ్ అయింది. ఇక తమిళంతో పోల్చుకుంటే తెలుగు, హిందీ ఆక్యుపెన్సీలో సినిమాలో తక్కువ ఆక్యుపెన్సీ నమోదైంది.

5వ రోజు కలెక్షన్స్: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2కి మొదటి రోజు రూ. 24 కోట్లు, రెండో రోజున రూ. 2.3 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా తొలి రోజు రూ. 28.85 కోట్లు షేర్, రెండో రోజు రూ. 24.40 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. ఈ క్రమంలో మూడో రోజున రూ. 28 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించింది. 4వ రోజు అంచనాల ప్రకారం 23 కోట్లు రాగా.. 5వ రోజు 12 కోట్ల నెట్ కలెక్షన్స్ రావచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 Ponniyin Selvan 2 Collections

5 రోజుల టోటల్ కలెక్షన్స్ : పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా విడుదలైన రోజు తమిళంలో పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 5 రోజుల్లో సినిమా రూ. 115.60 కోట్ల నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. PS 2 బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సౌత్ ఇండియా సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మొదటి వారంలో ఇండియా నెట్ కలెక్షన్స్ అయితే రూ. 125 కోట్ల చేరే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా ఈ వారం కూడా మరింత ఎక్కువ కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది.

 Ponniyin Selvan 2 Collections

ఇంకా ఎంత రావాలంటే..: PS 2 మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో పరవాలేదు అనే విధంగానే కలెక్షన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా రెండవ భాగం AP నైజాంలో 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది. ఇక 10.5 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే ఈ సినిమా సక్సెస్ అయినట్లు లెక్క. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజుల్లో దాదాపు 5 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక సినిమా మరో ఐదు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. మరి ఈ సినిమా ఆ టార్గెట్ ను ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X