హాట్ హీరోయిన్ కోసం పోలీసులు గాలింపు....ఎందుకు?
హైదరాబాద్: కన్నడ హాట్ హీరోయిన్ పూజా గాంధీ కోసం బెంగులూరు పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో పూజా గాంధీ ఎక్కడ ఉందో ఎవరికీ అంతు పట్టడం. ఆమెను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇంతకీ పూజా గాంధీ కోసం పోలీసులు ఇంతలా గాలించడానికి కారణం....తన కారుతో వర్ష అనే మహిళను ఢీ కొట్టి గాయ పరచడమే. బెంగుళూరులోని జయానగర్ లో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కారులో ఇంటికి వెలుతున్న ఆమె ద్విచక్ర వాహనంపై వెలుతున్న 50 సంవత్సరాల వర్ష అనే మహిళను ఢీ కొట్టింది.

ఈ సంఘటనలో వర్ష తీవ్రంగా గాయపడింది. అయితే పూజా గాంధీ వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుండి వెళ్లి పోయింది. ప్రస్తుతం వర్ష పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో ఐసీయూలో ఉంచారు. వర్ష కుటుంబ సభ్యులు...పూజా గాంధీపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.....పూజా గాంధీ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెలుతోందని, ఆమె రాష్ డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. పూజా గాంధీ వెంటనే తమకు కాంటాక్టులోకి రావాలని, విచారణకు సహకరించాలని కోరుతున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











