Don't Miss!
- News
Sadist: భార్య బయట ఉంటే ఇంట్లో వీడు ఏం చేశాడంటే ?, కూతురిని తల్లిని చేసి ?, క్లైమాక్స్ లో !
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pooja Hegde's Cirkus collections.. రణ్‌వీర్ సింగ్ మూవీకి దారుణంగా కలెక్షన్లు.. పూజా హెగ్గేకు మరో డిజాస్టర్?
బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్వలైన్ ఫెర్నాండేజ్, వరుణ్ శర్మ, మురళీ శర్మ, జానీ లీవర్, సంజయ్ మిశ్రా నటించిన సర్కస్ చిత్రం డిసెంబర్ 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సినీ విమర్శకులను, ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే?

115 కోట్ల బడ్జెట్‌తో
సర్కస్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని 115 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. భారీగా తారాగణం, సాంకేతిక నిపుణులు కారణంగా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అంతేకాకుండా కరోనావైరస్ పరిస్థితుల కారణంగా ఆలస్యం కావడం బడ్జెట్ తడిసిమోపెడు అయింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్‌గా హిట్ కావాలంటే.. కనీసం 125 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది.

రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో
ఇక సర్కస్ సినిమా థియేటర్ కౌంట్ విషయానికి వస్తే.. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో అత్యధిక థియేటర్లలో రిలీజైన సినిమాగా ఈ చిత్రం ఘనతను సాధించింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో విడుదల చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దాంతో తొలి రోజున కూడా బాక్సాఫీస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

తొలి రోజు ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే?
సర్కస్ మూవీ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. రణ్‌వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయారనేది ఆక్యుపెన్సీ రుజువు చేసింది ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, సూరత్, చంఢీగడ్ లాంటి ప్రాంతాల్లో కనీసం 10 శాతం కూడా ఆక్యుపెన్సీ కనిపించలేదు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ యాత్ర నిరాశగా మొదలైంది.

సర్కస్ మూవీ తొలి రోజు కలెక్షన్లు
రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా సర్కస్ సినిమా వసూళ్లను నమోదు చేసింది. ఇండియా వైడ్ ఈ సినిమా తొలి రోజున 7 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. రక్షబంధన్, జుగ్ జుగ్ జీయో లాంటి చిత్రాల వసూళ్లు 15 కోట్లకు ధీటుగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇక యూఎస్‌లో ఈ సినిమా తొలి రోజున 60 లక్షల మేర వసూళ్లను సాధించింది.

సర్కస్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
సర్కస్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే.. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 7.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిట్ కావాలంటే.. ఇంకా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ఈ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తూ పోతే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అనే మాట వినిపిస్తున్నది.