Most eligible bachelor ఎంత లాభం వచ్చిందంటే.. అఖిల్ కెరీర్‌లోనే బెస్ట్‌గా

దీపావళీ కానుకగా థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను రొమాంటిక్ అనుభూతులను పంచిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బాక్సాఫీస్ రన్ పూర్తయింది. దసరా బరిలో నిలిచిన ఈ చిత్రం క్లీన్ హిట్‌ను సొంతం చేసుకొన్నది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ఈ చిత్రం మంచి లాభాలను పంచింది. అయితే ఈ సినిమా టోటల్ కలెక్షన్లు ఎలా? ఏ మేరకు ఉన్నాయంటే..

 అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌కు స్పెషల్‌గా

అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌కు స్పెషల్‌గా

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా ఓ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌కు ఈ సినిమా ఎంతో స్పెషల్‌గా మారింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే ఈ చిత్రం మంచి టాక్‌తోపాటు భారీ కలెక్షన్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో రోజవారీ కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో రోజవారీ కలెక్షన్లు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి సంబంధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తొలి రోజున రూ.5.45 కోట్లు, రెండో రోజున రూ.4.54 కోట్లు, మూడో రోజున రూ.4.03 కోట్లు, నాలుగో రోజున రూ.1.59 కోట్లు, ఐదో రోజున రూ.131 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత కలెక్షన్లు సగానికిపైగా పడిపోయాయి. 6వ రోజున 57 లక్షలు, 7 వ రోజున 36 లక్షలు, 8 రోజున 19 లక్షలు, 9 రోజున 32 లక్షలు, 10 రోజున 51 లక్షలు, 11వ రోజున 24 లక్షలు, 12వ రోజున 15 లక్షలు రాబట్టింది. మిగితా రోజుల్లో మొత్తంగా 80 లక్షలు వసూలు చేసింది.

ఏపీ, తెలంగాణలో మొత్తం వసూళ్లు

ఏపీ, తెలంగాణలో మొత్తం వసూళ్లు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం ఏపీ, తెలంగాణలో మొత్తంగా ఇప్పటి వరకు 33.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, రూ.20.09 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 17.5 కోట్లుగా ట్రేడ్ వర్గాలు లెక్క తెల్చాయి. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2.5 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకొన్నది.

 ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో

ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో

ఇక తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్‌ చిత్రం కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.1.55 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం రూ.2.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల వసూళ్లను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా రూ.24.14 కోట్లు నికరంగా, 40.60 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

Recommended Video

Date With Akhil Tour | Akhil Interaction With Crazy Girls
 ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కలెక్షన్లు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం హక్కులను రూ.5.5 కోట్లు, సీడెడ్ రూ.3 కోట్లు, ఆంధ్రా రూ.9 కోట్లతో కలిపి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 17.5 కోట్ల మేర బిజినెస్ చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ బిజినెస్ రూ.1 కోటి చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్లు బిజినెస్ నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 19 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగి 24 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా దాదాపు 5 కోట్లకుపైగానే లాభాలను సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X