Pottel Collections: షాకింగ్‌గా పొట్టేల్ వసూళ్లు.. అనన్య నాగళ్ల మూవీకి కలెక్షన్లు ఎంతంటే?
నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్, సాహిత్ మోత్కూరి రైటింగ్స్ బ్యానర్లపై నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సాదిగే నిర్మించిన చిత్రం పొట్టేల్. యువ దర్శకుడు సాహిత్ మోత్కూరి రూపొందించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల , యువ చంద్రకృష్ణ, అజయ్, నోయల్, ప్రియాంక శర్మ తదితరులు నటించారు. తెలంగాణలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 25వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
పొట్టేల్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందడంతో బడ్జెట్ ఎక్కువగానే అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్, సాంకేతిక నిపుణుల పారితోషికాలన్నీ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెన్‌ను 3 కోట్లుగా విలువ కట్టారు. సుమారుగా 3.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది.

పొట్టేల్ సినిమా టీజర్ మాత్రమే కాకుండా ట్రైలర్ కూడా భారీ బజ్ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై క్రేజ్ ఉన్న నేపథ్యంలో మోస్తారుగా ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా దాదాపు 40 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక పొట్టేల్ సినిమా మిక్స్‌డ్ టాక్ రావడంతో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో ఈ మూవీ 10 లక్షలు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా 60 లక్షల రూపాయల నెట్, 1.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక ఓవర్సీస్‌లో కూడా ఓ మోస్తారు ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ సినిమా నార్త్ అమెరికా, ఇతర ప్రాంతాల్లో కలుపుకొని 50 లక్షలు నికరంగా 1 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ మూవీ సుమారుగా 2.2 కోట్ల రూపాయల గ్రాస్, 1.1 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రాబోయే రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా? అనేది వేచి చూడాల్సిందే.
పొట్టేల్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో రెండో రోజు భారీగా వసూళ్లు పడిపోయాయి. ఈ చిత్రం రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రూాపాయలు నికరంగా, 50 లక్షల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.


Click it and Unblock the Notifications











