అమావాస్య చీకట్లో పౌర్ణమి
మెగా మేకర్‌గా తెలుగు సినిమా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న ఎంఎస్ రాజుకి పౌర్ణమి సినిమా పరాజయం మింగుడు పడడం లేదు. అర్ధం పర్ధం లేని పాత చింతకాయ పచ్చడి లాంటి కథ సినిమాను దెబ్బతీసింది. కథా నేపథ్య కాలం పాత రోజులకి తీసికెళ్లి ప్రత్యేకంగా కనిపించినా కథనం మాత్రం ఎన్నో సార్లు వాడిన భాషా మూసలోకి వెళ్లి ప్రమాదం తెచ్చి పెట్టింది. ఫస్టాఫ్ బోర్ కొట్టకుండా నడపటం, క్లైమాక్స్ పాట బాగుండటం కొంత వరకు ఊరట. అయినా ఈ సినిమా కలెక్షన్లు రెండోరోజు నుంచే దారుణంగా పడిపోయాయి. వరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎంఎస్ రాజు ఇటువంటి కథను ఎందుకు ఎంచుకున్నారో తెలియడం లేదు. ఈ సినిమా పరాజయానికి దర్శకుడు ప్రభుదేవాయే కారణమని పరిశ్రమలోని ఒక వర్గం విమర్శిస్తోంది. ప్రధాన హీరోయిన్ త్రిష కంటే ఆయన చార్మికి ప్రాధాన్యం కల్పించారని వీరి విశ్లేషణ. మూడు పాటలు బాగున్నా దేవిశ్రీ ప్రసాద్ కూడా పరాజయానికి ఒక కారణమని విమర్శ వచ్చింది.


Click it and Unblock the Notifications