తెలివైన స్టెప్: ఎన్టీఆర్ కి దారిచ్చాడు
హైదరాబాద్ : రవితేజ హీరోగా నటించిన చిత్రం 'పవర్' . హన్సిక, రెజీనా హీరోయిన్స్ . కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూర్చారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. ఈ చిత్రం సెప్టెంబర్ 5 న విడుదల చేయాలని నిర్ణయించామని నిర్మాత నిన్న జరిగిన ఆడియో పంక్షన్ లో తెలియచేసారు. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 29న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ...అదే రోజున ఎన్టీఆర్ చిత్రం రభస విడుదల అవుతూండటంతో రిలీజ్ తేదిని ముందుకు తోసారని సమాచారం. ఒకే సారి రెండు పెద్ద సినిమాలు విడుదల పెట్టుకుంటే థియోటర్స్ సమస్య వస్తుంది కాబట్టి ఇలా వాయిదా వేసుకోవటం మంచిదని ఇండస్ట్ర్రీలో పెద్దలు అంటున్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''తెలుగు సినిమా నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ విషయమై నాలుగేళ్లగా రవితేజతో మాట్లాడుతున్నాను. మంచి కథ దొరికితే చెబుతా అనేవారు. 'పవర్' కథ విని నాకు కబురు పెట్టారు. కథ వినగానే నాకూ నచ్చింది. వెంటనే ప్రారంభించాం. ఈ సినిమాతో రవితేజలోని జోరును కొద్దిగానే వినియోగించుకున్నాం. ఇంకా చాలా వినియోగించుకోవాల్సి ఉంది. బాబి దర్శకత్వ శైలి, తమన్ పాటలు బాగున్నాయి. సినిమాను సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ''పవర్ ఫుల్ పోలీస్ కథ ఇది. పేరుకు తగ్గట్టుగానే ప్రతీ సన్నివేశం శక్తిమంతంగా ఉంటుంది. రవితేజ సినిమా నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తారో.. అవన్నీ మేళవించి ఓ రంగుల హరివిల్లులా తీర్చిదిద్దాం. సెప్టెంబర్ 5న 'పవర్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.
రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).


Click it and Unblock the Notifications











