Prabhas 25: కళ్లు చెదిరే బడ్జెట్.. ఆ యువ దర్శకుడు హ్యాండిల్ చేయగలడా?
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా అనంతరం వరుసగా మరిన్ని పాన్ ఇండియా సినిమాలను వెండి తెర పైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో ప్రతి సినిమా కూడా అంతకు మించి అనేలా ఉండాలని బలమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఒక విధంగా దర్శకులు నిర్మాతలు కూడా ప్రభాస్ రేంజ్ కు తగ్గట్లుగానే కథలను తీసుకువస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ను మరో లెవల్ కు తీసుకువెళ్లబోతున్నట్లు అర్థమవుతోంది.
ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేస్తున్నన్ని బిగ్ బడ్జెట్ సినిమాలను ఎవరు చేయడం లేదు. త్వరలోనే తన ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాపై కూడా ప్రభాస్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ కు సంబంధించిన ఒక రూమర్ అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

వరుసగా మూడు సినిమాలు
రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాధేశ్యామ్ సినిమా పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ సినిమా తర్వాత డార్లింగ్ ప్రశాంథ్ నీల్ తో సలార్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే రానున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ప్రభాస్ వచ్చే ఏడాది ఈ మూడు సినిమాలను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరింత బిజీగా..
ఇక మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ను ఇటీవల సెట్స్ పైకి తీసుకువచ్చారు. ఆ సినిమాను కూడా ప్రభాస్ వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి గ్యాప్ లేకుండా మూడు సినిమాలతో బిజీ కాబోతున్నాడు. పక్కా ప్రణాళికతోనే ప్రభాస్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రానున్న రోజుల్లో అయితే మరింత బిజీ కానున్నట్లు అర్థమవుతోంది.

ప్రభాస్ 25.. దర్శకుడు ఫిక్స్?
ఇక ప్రభాస్ ప్రస్తుతం 25వ సినిమాపై కూడా ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నట్లు ఒక టాక్ అయితే నడుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 7న ఆ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి ప్రభాస్ 25వ ప్రాజెక్టును తెరకెక్కించనున్నట్లు మరొక వార్త హాట్ టాపిక్ గా మారింది.

బడ్జెట్ ఎంతంటే..
ప్రభాస్ 25వ సినిమా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల కంటే అత్యధిక బడ్జెట్ తోనే రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ యు.వి.క్రియేషన్స్ తో పాటు మరో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మించిన బోయే అవకాశం ఉందట. ఇక ప్రభాస్ 25వ సినిమాకు దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించే అవకాశం ఉందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా కూడా అంతటి భారీ బడ్జెట్ తో తెరపైకి వచ్చింది లేదు.
Recommended Video

మరో రెండు ప్రాజెక్టులు..?
మరోవైపు ప్రభాస్ మరో రెండు ప్రాజెక్టుల విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోయే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయాలని అనుకుంటున్న ప్రభాస్ ఆ సినిమాను దిల్ రాజుకు అప్పగించే అవకాశం ఉందట. అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో కూడా సినిమా చేయడానికి ఒక కమిట్మెంట్ ఇచ్చిన డార్లింగ్ బాలీవుడ్ సినిమా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











