twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ 70 అడుగుల కటౌట్.. రికార్డు ప్రీరిలీజ్ బిజినెస్.. దేశవ్యాప్తంగా మోర్మోగుతున్న సాహో

    |

    బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రెండింతలు పెరిగిపోయిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బాహుబలికి ముందు కేవలం టాలీవుడ్‌కే పరిమితమైన యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం నేషనల్ హీరో అయ్యాడు. దేశవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా సంపాదించుకొన్నారు. ఈ క్రమంలో ఆగస్టు 30న రిలీజ్ కానున్న సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి.

     అట్టహాసంగా ప్రీరిలీజ్ ఈవెంట్

    అట్టహాసంగా ప్రీరిలీజ్ ఈవెంట్

    దేశ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో చిత్రం రిలీజ్‌కు ముందే ఎన్నో విశేషాలను సొంతం చేసుకొంటున్నది. ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రభాస్‌పై నిలువెత్తు అభిమానాన్ని చాటుకొన్నారు.

    70 అడుగుల కటౌట్

    70 అడుగుల కటౌట్

    సుమారు 70 అడుగుల ప్రభాస్ కటౌట్‌ను డై హార్డ్ ఫ్యాన్స్ రూపొందించడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ భారీ కటౌట్ లక్షలాది మందిని ఆకర్షించడమే కాకుండా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రభాస్‌పై పెరుగుతున్న అంచనాలపై సినీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. ఆ కారణంగానే నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. టాలీవుడ్‌లో నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్లలో సాహో ప్రీ రిలీజ్ ఒకటి కావడం గమనార్హం.

     జాతీయ స్థాయి నటులతో

    జాతీయ స్థాయి నటులతో

    ఇటీవల జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలీవుడ్, దక్షిణాది తారలందరూ తరలి వచ్చారు. శ్రద్దాకపూర్, అరుణ్ విజయ్, సుజిత్, ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత అల్లు అరవింద్, మురళీశర్మ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడి, జాకీ ష్రాఫ్, ,చంకీ పాండే తదితరులు నటిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కొందరు ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కాలేకపోయారని ప్రభాస్ వెల్లడించిన విషయం తెలిసిందే.

    332 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

    332 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

    ఇక రిలీజ్‌కు ముందు ప్రభాస్ సాహో మరో రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా బిజినెస్ రూ.332 కోట్ల మేర జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నైజాంలో రూ.40 కోట్లకు, సీడెడ్‌లో రూ.25 కోట్లు, నెల్లూరులో 4.50 కోట్లు, గుంటూరులో 12.50 కోట్లు, కృష్ణాలో రూ.8 కోట్లు, పశ్చిమ, తూర్పు గోదావరి రూ.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.16 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

    రికార్డు ధరకు హిందీ హక్కులు

    రికార్డు ధరకు హిందీ హక్కులు

    అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సాహో ప్రీ రిలీజ్ రికార్డు స్థాయిలో జరిగింది. కర్ణాటకలో రూ.28 కోట్లు, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కలిపి రూ.18 కోట్లతో దేశవ్యాప్తంగా హిందీ హక్కులు రూ.120 కోట్ల మేర బిజినెస్ చేయడం జరిగింది. ఇండియాలో మొత్తంగా 290 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.42 కోట్లతో మొత్తంగా 332 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ లెక్క తేలినట్టు సమాచారం.

    English summary
    After Bahubali the face of Telugu Cinema become Prabhas. On pre release event fans installed Prabhas's 70 foot cutout. It is not even exaggeration in saying Bahubali became the face of Indian Cinema in the world. This film's pre release business set bench mark for Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X