Adipurush: ఒక్క ట్రైలర్ తో మారిన అంచనాలు.. తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ బిజినెస్!
ఇండియన్ నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. బాహుబలి తర్వాత సరైన సక్సెస్ చూడని ప్రభాస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడియన్స్ ను నిరాశపరచకూడదు అని కూడా అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాపై ఇటీవల మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఆదిపురుష్ సినిమా భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
టీజర్ విడుదలైన తర్వాత:బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఎంతో ఇష్టంగా మొదలుపెట్టిన ఆదిపురుష్ సినిమా పై మొదట్లోనే అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఇవేమీ గ్రాఫిక్స్ అంటూ దారుణంగా ట్రోల్ అయితే చేశారు. ప్రభాస్ నుంచి ఇలాంటి సినిమాను ఊహించలేదు అని అసలు గ్రాఫిక్స్ ఏ మాత్రం బాగోలేవు అని ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ చెందారు

మరో 100 కోట్ల ఖర్చుతో..:తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన తర్వాత ప్రభాస్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నాడు. వెంటనే సినిమా కోసం మళ్ళీ గ్రాఫిక్స్ పనుల విషయంలో రివర్క్ చేయాల్సిందిగా నిర్మాతలతో మాట్లాడాడు. మళ్ళీ VFX కంపెనీ తో చర్చలు జరిపి మరో 100 కోట్ల ఖర్చుతో సినిమా రూపురేఖలు మార్చేశారు. కంటెంట్ పై నమ్మకం ఉన్నప్పటికీ గ్రాఫిక్స్ కారణంగా మళ్ళీ సినిమా మూడ్ చెడిపోవద్దని ప్రభాస్ ఆలోచించాడు. అందువల్లే ఇప్పుడు విడుదలైన ట్రైలర్ అంచనాల స్థాయిని పెంచింది.

ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్:సినిమా స్టార్ట్ అయినప్పుడు తప్పకుండా సినిమా మంచి బిజినెస్ చేస్తుందని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు రావడం వలన డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను కొనేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదు. కానీ ఇప్పుడు మాత్రం ట్రైలర్ రెస్పాన్స్ చూసి ఒక్కసారిగా నిర్మాతలను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఒపెనింగ్స్ అయితే అందుకుంటుంది. టాక్ బాగుంటే జాక్ పాట్ కొట్టేసినట్లే అని చెప్పవచ్చు.

బిజినెస్ లోకి యూవీ క్రియేషన్స్:ఇక ఈ సినిమా ఏపీ నైజాం హక్కుల కోసం కూడా గట్టి పోటీ ఎదురైంది. మొదటి నుంచి కూడా ప్రభాస్ స్నేహితులు UV క్రియేషన్స్ తెలుగు హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. మధ్యలో మరొకరికి అమ్మినట్లు కూడా కథనాలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. ప్రభాస్ ఫ్రెండ్స్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు డీల్ ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో బిజినెస్ ఎంతంటే?:తెలుగులో అయితే మొదట 100 కోట్ల రేంజ్ లో డిమాండ్ ఉండగా ఇప్పుడు పెరిగిన డిమాండ్ ను బట్టి ఆ లెక్క 150 కోట్లకు వెళ్లినట్లు టాక్ అయితే వస్తోంది. టీ సీరీస్ ఓం రౌత్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక డీల్ విషయంలో ప్రభాస్ పెద్దగా ఇన్వాల్వ్ కాలేదట. యూవీ స్వయంగా బిజినెస్ విషయంలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమాతో ప్రభాస్ మళ్ళీ బాహుబలి స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఇక ప్రభాస్ సలార్ సినిమా కూడా ఇదే ఏడాది రాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











