Adipurush Bussiness: తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ మరో రికార్డ్ బిజినెస్.. ఏపీ, నైజాంలో మొత్తం ఎంతంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుతాయి ఇంతకుముందే చాలా క్లారిటీగా అర్థమయింది. బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి సక్సెస్ చూడకపోయినప్పటికీ కూడా ప్రభాస్ ప్రతి సినిమాకు అదే స్థాయిలో క్రేజ్ అయితే అందుతుంది. ఇక ఇప్పుడు రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. సినిమా ఎంత బిజినెస్ చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంత వస్తే సక్సెస్ అయినట్లు లెక్క అనే వివరాల్లోకి వెళితే..
భారీ స్థాయిలో ఓపెనింగ్స్ పక్కా : ప్రభాస్ ఆదిపురుష్ సినిమా పై మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతూ వస్తున్నాయి. మధ్యలో టీజర్ పై కాస్త అసంతృప్తి వెలువడినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుని సరికొత్తగా విడుదల చేసింది. జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదిపురుష్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంటుంది అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. విడుదలైన ట్రైలర్స్ కూడా మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది.

నైజాంలో బిగ్ డీల్ : ఇక గతంలోనే ప్రభాస్ తన సినిమాలో బిజినెస్ లెక్కలతో ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఇక ఈసారి ఆదిపురుష్ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ అయితే చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఏరియాలో వారిగా చూసుకుంటే మొదట తెలంగాణలోనే మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. దీంతో సినిమాను నైజాం డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు 50 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తప్పకుండా సినిమా ఈ రికార్డును తొందరగానే బ్రేక్ చేస్తుంది అని బయ్యర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఉత్తరాంధ్రలో, వెస్ట్ గోదావరిలో : ఇక మిగతా ఏరియాలో విషయానికి వస్తే ప్రధానంగా సీడెడ్ ఏరియాలో కూడా ప్రభాస్ లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అక్కడ 17.60 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇక ఉత్తరాంధ్రలో కూడా 14.50 కోట్లకు ఈ సినిమానాలను కొనుగోలు చేశారు. ఈస్టులో 8.80 కోట్ల బిజినెస్ చేసిన ఆదిపురుష్ సినిమా వెస్ట్ గోదావరిలో 7.20 కోట్ల వరకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది.

గుంటూరు, కృష్ణ ఏరియాలలో : ఇక గుంటూరులో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆదిపురుష్ సినిమా థియేటర్ల హక్కులను సొంతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ అయితే బాగానే పోటీపడ్డారు. ఇక అక్కడ 8.60 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా కృష్ణ లో 8.50 కోట్లు నెల్లూరులో 4.80 కోట్ల వరకు బిజినెస్ అయితే చేసింది. ఒక విధంగా ప్రభాస్ కెరీర్ లోనే ఇవి కూడా బెస్ట్ డీలింగ్స్ అని చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications











