ఆదిపురుష్ షాకింగ్ బిజినెస్.. తెలుగు రాష్ట్రాలలో డీల్ ఎంతంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ లో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీని త్రీడీలో బిగ్ స్క్రీన్ పై రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఆదిపురుష్ ట్రైలర్ మూవీపై అంచనాలు భారీగా పెంచేసింది. దీంతో ఈ సినిమాపై బిజినెస్ డీల్స్ కూడా గట్టిగానే అవుతున్నాయి. థీయాట్రికల్ బిజినెస్ ద్వారానే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేలా ఉందనే మాట వినిపిస్తోంది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకి రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Prabhas adipurush movie telugu states pre release bussiness deal

కృతి సనన్ ఈ మూవీలో సీతాదేవిగా నటిస్తూ ఉండగా సైఫ్ ఆలీఖాన్ రావణుడి పాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ దృష్టి పెట్టింది. అందులో భాగంగా తిరుపతిలో జూన్ 6న గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్రణాలికలు వేస్తున్నారు. ఈ నెల 29న ఆదిపురుష్ నుంచి రెండో సాంగ్ ని లాంచ్ చేయబోతున్నారు.

దీని తర్వాత ప్రమోషన్స్ స్పీడ్ పెంచబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన తెలుగు రాష్ట్రాల థీయాట్రికల్ బిజినెస్ డీల్ గురించి ఆసక్తికరమైన న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుందంట.

Prabhas adipurush movie telugu states pre release bussiness deal

ఏకంగా 170 కోట్లు చెల్లించి ఈ రైట్స్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. మొన్నటి వరకు తెలుగు స్టేట్స్ లో 150 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు 20 కోట్లు అదనంగా డీల్ కుదరడం విశేషం. ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. అలాగే రామాయణం కథ ఆధారంగా వస్తోన్న చిత్రం కావడంతో పాజిటివ్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతారని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X