twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Prabhas: వర్షం నుంచి సాహో వరకు.. ప్రభాస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా పెరిగాయంటే?

    |

    టాలీవుడ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రభాస్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా మరొక స్థాయికి వెళ్ళాడు. రానున్న రోజుల్లో అతని హోదా బాక్సాఫీస్ వద్ద మరింత పెరగనుందని ప్రస్తుతం లైనప్ ను చూస్తే చాలా క్లారిటీ గా అర్థం అవుతోంది. భవిష్యత్తులో ప్రభాస్ హాలీవుడ్ లో కూడా చక్రం తిప్పుతాడు అని ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు పాజిటివ్ గా స్పందించారు. ఇక నేడు 41 పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రభాస్ స్టార్ హోదా ఎలా పెరిగింది అనే విషయంలోకి వెళితే.. వర్షం నుంచి సాహో వరకు ప్రభాస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

    మొదటి సక్సెస్ వర్షం

    మొదటి సక్సెస్ వర్షం

    ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అతనికి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. కానీ ప్రభాస్ కెరీర్ మొదట్లో చాలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చేడు. కానీ మొదటి సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత చేసిన రాఘవేంద్ర సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అతనికి వచ్చిన మొదటి సక్సెస్ మాత్రం వర్షం సినిమాతోనే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించింది. దాదాపు 22 కోట్ల వరకు లాభాలను అందుకున్న ఆ సినిమా ప్రభాస్ ఇమేజ్ ను మరింత పెంచింది.

    ఛత్రపతి బాక్సాఫీస్ హిట్

    ఛత్రపతి బాక్సాఫీస్ హిట్

    వర్షం సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ కు వరుసగా ఆఫర్స్ చాలానే వచ్చాయి. వర్షం సినిమా తర్వాత ప్రభాస్ అడవి రాముడు చక్రం అనే సినిమాలను చేశాడు. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో చేసిన చత్రపతి సినిమా అతని కెరీర్ ను మరో స్థాయికి తీసుకు వెళ్లాయి. ఎనిమిది కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కూడా 22 కోట్లకు పైగా వసూళ్లను అందుకొని ప్రభాస్ మార్కెట్ ను అమాంతంగా పెంచేసింది.

    బిల్లా సినిమాతో ఫామ్ లోకి..

    బిల్లా సినిమాతో ఫామ్ లోకి..

    2005లో చత్రపతి హిట్ అయిన తర్వాత ప్రభాస్ కొన్నాళ్ల పాటు వరుసగా అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. పౌర్ణమి యోగి మున్నా బుజ్జిగాడు వంటి సినిమాలు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఏదైనా రీమేక్ సినిమా చేసే హిట్ అందుకోవాలని అనుకున్నాడు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన బిల్లా సినిమా ప్రభాస్ ను మళ్లీ ఫామ్ లోకి తెచ్చింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద 26 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

     అప్పట్లో ప్రభాస్ బిగ్గెస్ట్ హిట్

    అప్పట్లో ప్రభాస్ బిగ్గెస్ట్ హిట్

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ ఏక్ నిరంజన్ అని మరొక సినిమా కూడా చేశాడు. కానీ ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో చేసిన క్యూట్ లవ్ స్టొరీ డార్లింగ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డార్లింగ్ సినిమా 25 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడంతో ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

    మిర్చితో సాలీడ్ హిట్

    మిర్చితో సాలీడ్ హిట్

    డార్లింగ్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా చాలా దగ్గర చేసింది. దశరథ్ దర్శకత్వంలో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా లాభాలు అందించడంతో ప్రభాస్ మార్కెట్ మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. తర్వాత వచ్చిన రెబల్ సినిమా మాత్రం మళ్లీ డౌన్ అయ్యేలా చేసింది. ఇక వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చేసిన మిర్చి సినిమా 80 కోట్ల వరకు వసూళ్లను అందుకని ప్రభాస్ హోదాను మరింత పెంచింది.

    బాహుబలితో భారీ విజయం

    బాహుబలితో భారీ విజయం

    తన సినీ జీవితంలో ప్రభాస్ మొదటిసారి ఐదేళ్ల పాటు ఒకే సినిమా కోసం కష్టపడ్డాడు. బాహుబలి రెండు భాగాల కోసం ప్రభాస్ నిర్విరామంగా కష్ట పడిన విధానానికి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మధ్యలో మరొక సినిమా చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఒప్పుకోలేదు. ఇక మొదటి పార్ట్ ను 80 కోట్లతో తెరకెక్కించగా ఆ మూవీ దాదాపు 600 పైగా వసూళ్లను అందుకుంది. బాహుబలి 2 వ భాగం తో ప్రభాస్ తన స్టార్ హోదాను పెంచుకోవడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని కూడా ప్రపంచం ముందు నిలబెట్టాడు. ఆ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల వసూళ్లను అందుకోవడం విశేషం.

    సాహో సినిమాతో సేఫ్.. కానీ..

    సాహో సినిమాతో సేఫ్.. కానీ..

    బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ స్టార్ హోదా ఏమిటో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ ప్రభావం వలన సాహో సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించారు. సాహో సినిమా కోసం నిర్మాతలు ఒకేసారి మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇక ఆ సినిమా బాక్సాఫీసు వద్ద 450 కోట్ల వరకు వసూళ్లు అందుకుంది. ఈ సినిమాతో నిర్మాతలు సేఫ్ అయ్యారు. కానీ కొంతమంది బయ్యర్లు మాత్రం నష్టపోయారు. ఇక త్వరలో రాబోయే రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాతో ఇంకా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Prabhas career best box office hits and collections,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X