ప్రభాస్ ఒక్కడే 5450 కోట్లు ఇచ్చేశాడే.. డార్లింగ్ సరికొత్త రికార్డు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఇండియాలోనే టాప్ హీరోగా చలామణి అవుతున్నారు ఆయన. బాక్సాఫీస్ రికార్డులను తిరగాసే దమ్ము నటుడిగానూ ప్రభాస్ ఇప్పటికే తన సినిమాలతో రుజువు చేసుకున్నారు. ప్రభాస్ సినిమాలకు ప్రస్తుతం ఇండియాలోనే కాదు వరల్డ్ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉండటం విశేషం. అందుకు తగట్టు గానే ప్రభాస్ కూడా తన రాబోయే చిత్రాలను భారీ స్థాయిలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే, ప్రభాస్ ఇఫ్పుడు కూడా వరుస పెట్టి చిత్రాలు చేస్తున్నారు. డార్లింగ్ ను నమ్ముకొని నిర్మాతలు అత్యధిక బడ్జెట్ తో చిత్రాలను నిర్మిస్తున్నారు. సాలిడ్ యాక్షన్ చిత్రాలను రూపొందిస్తూ డార్లింగ్ ద్వారా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ బాక్సాఫీస్ రిపోర్డ్ లెక్కల ప్రకారం డార్లింగ్ ఒక రేర్ రికార్డును క్రియేట్ చేశారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ ఒక్కడే వేల కోట్ల వసూళ్లను సాధించి ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారాడు.

ప్రభాస్ చివరి 9 ఏళ్లలో నటించిన చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డుల విషయంలో 10 ఏళ్ల సమయంలో కేవలం ప్రభాస్ ఒక్కడే 5,450 కోట్ల వసూళ్లను తన చిత్రాల ద్వారా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ స్థాయిలో వసూళ్లు సాధించింది కేవలం ప్రభాస్ ఒక్కడే కావడం విశేషం. ఇండియాలోని ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనే ప్రభాస్ ఒక్కడే ఆ రికార్డును క్రియేట్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.
ప్రభాస్ 2015 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో ఏఏ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేశాడు. ఏఏ చిత్రం ఏ ఏడాదిలో థియేటర్లలో విడుదలైందనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఊచకోత 'బాహుబలి'తో మొదలైంది. ఈ చిత్రాన్ని ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 2015లో విడుదలైంది. 650 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. సుజీత్ దర్శకత్వంలో 2019లో వచ్చిన సాహో చిత్రం రూ.420 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత రాధే శ్యామ్ తో రూ.150 కోట్లు, ఆదిపురుష్ తో రూ.350 కోట్లు అందుకున్నాడు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ : సీజ్ ఫైర్ చిత్రంతో రూ.700 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేశాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 2024లో విడుదలైన 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో 1100 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టాడు. ఇక కేవలం 2017లో వచ్చిన 'బాహుబలి : ది కన్ క్లూజన్'తో బాక్సాఫీస్ వద్ద రూ.1810 కోట్లు కలెక్ట్ చేశాడు. ఇండియన్ హయ్యేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన మూడో చిత్రంగా ప్రస్తుతం రికార్డును హోల్డ్ చేసింది. మొన్నటి వరకు 2వ స్థానంలో ఉన్నా.. పుష్ప2 రూ.1870 కోట్లు కలెక్ట్ చేసి 2వ స్థానంలో నిలిచింది. ఇక ప్రభాస్ నుంచి నెక్ట్స్ 'రాజా సాబ్' చిత్రం రానుంది. ఉగాదికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











