Kalki 2898 AD: బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. తొలి హీరోగా ఊహించని రికార్డు
పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సాధించుకుని.. కొంత కాలంగా పాన్ ఇండియా రేంజ్ హీరోగా దూసుకుపోతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో భారీ చిత్రాలతో సత్తా చాటుతోన్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాను చేశాడు. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'కల్కి 2898 ఏడీ' మూవీ బాలీవుడ్‌లో రికార్డు కొట్టింది. ఆ వివరాలు మీకోసమే!
విశ్వరూపం చూపిన స్టార్
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన హాలీవుడ్ రేంజ్ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు చేశారు.

హాలీవుడ్ రేంజ్‌లో షేక్
మొదటి నుంచే అంచనాలను భారీ స్థాయిలో పెంచుకున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో ఈ సినిమా హడావిడి భారీ స్థాయిలో కనిపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో సైతం ప్రభాస్ సినిమా ఓ షేక్ చేసేసింది. ఫలితంగా ఈ చిత్రం గ్లోబల్ రేంజ్‌కు చేరుకుంది.

డబుల్ సెంచరీ కొట్టేసి
టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించిన షోలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పడిపోయాయి. ఈ మూవీకి టాక్ కూడా డీసెంట్‌గానే లభించింది. అంతటా దీనికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక, రెండు రోజుల్లోనే ఇది రూ. 260 కోట్లు కొల్లగొట్టేసింది.

హిందీలో భారీ స్థాయిలో
ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో దీన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. హిందీలో కూడా ఈ చిత్రాన్ని భారీగానే తీసుకు వచ్చారు. అనుకున్నట్లుగానే అక్కడ కూడా ఇది మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇలా మొదటి రోజు రోజుల్లో రూ. 44 కోట్లు వసూలు చేసింది.
బాలీవుడ్‌లో కొత్త రికార్డ్
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీ హిందీలో అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా మొదటి రోజు అక్కడ ఈ సినిమా ఏకంగా రూ. 22.50 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. దీంతో బాలీవుడ్‌లో నాలుగు సార్లు రూ. 20 కంటే ఎక్కువ నెట్ సాధించిన ప్రభాస్ చిత్రంగా ఇది నిలిచింది. మరే భాషకు చెందిన హీరో కూడా ఈ ఫీట్ సాధించలేదు.


Click it and Unblock the Notifications











