The RajaSaab Box Office: డిజాస్టర్‌తోనూ బాక్సాఫీస్ రికార్డ్... ది రాజాసాబ్‌తో ఏకైక హీరోగా ప్రభాస్ రేర్ ఫీట్

మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ ది రాజాసాబ్. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు పీడకలను మిగిల్చింది. ప్రీమియర్స్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ది రాజాసాబ్ క్రమంగా వసూళ్లు కోల్పోతూ వచ్చింది. సంక్రాంతి సీజన్‌లో ఏదోలా నెగ్గుకొస్తుందని భావించినప్పటికీ పెద్ద పండక్కి విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి వంటి సినిమాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని డిజాస్టర్‌గా నిలిచి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు వందల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రభాస్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయిన సంగతి తెలిసిందే. ఇండియాలో వన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్‌గా, భారీ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు డార్లింగ్. ఆయన పేరు మీద వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో సినిమాలు డిజాస్టర్లుగా నిలిచినా కల్కి 2998 ఏడీ, సలార్ సినిమాలతో ప్రభాస్ మరోసారి ట్రాక్‌లోకి వచ్చారు.

Prabhas Creates Rare Box Office Record Despite The Raja Saab Turning Disaster

డిజాస్టర్‌గా ది రాజాసాబ్
కల్కి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా ది రాజాసాబ్. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్‌లు హీరోయిన్‌లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను దాదాపు 450 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించగా.. 250 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజాసాబ్ ఇప్పటి వరకు ఇండియాలో 143.24 నెట్... 171 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో 34.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో కలిపి వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 205.26 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. కేవలం ప్రభాస్ క్రేజ్, ఛరిష్మాతోనే ది రాజాసాబ్ 200 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. దాంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని మిగిల్చింది ది రాజాసాబ్.

డిజాస్టర్‌తోనూ రేర్ ఫీట్
అయితే ఇలాంటి డిజాస్టర్‌తోనూ ప్రభాస్ అరుదైన బాక్సాఫీస్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. హిట్, ఫ్లాప్‌లకు అతీతంగా ప్రభాస్ సినిమాలు వందల కోట్ల రూపాయల వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనూ ది రాజాసాబ్‌ను తన భుజాలపై మోసిన డార్లింగ్.. 200 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను దాటించారు. అయితే ఆయన కెరీర్‌లో ఇలా 200 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్‌ను ది రాజాసాబ్‌తో కలిపి 7 సార్లు దాటారు. తద్వారా టాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించారు.

ఓన్ అండ్ ఓన్లీ స్టార్‌గా ప్రభాస్
ది రాజాసాబ్‌కు ముందు.. బాహుబలి (650 కోట్ల రూపాయలు), బాహుబలి 2 (1810 కోట్ల రూపాయలు), సాహో (405 కోట్ల రూపాయలు), ఆదిపురుష్ (350 కోట్ల రూపాయలు), రాధేశ్యామ్ ( 214 కోట్ల రూపాయలు), సలార్ ( 720 కోట్ల రూపాయలు), కల్కి 2898 ఏడీ (1200 కోట్ల రూపాయలు) సాధించాయి. వీటిలో రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్లుగా నిలిచాయి. ఫ్లాప్ అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ కారణంగా అవి అవలీలగా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టి 200 కోట్ల మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. దాంతో ప్రభాస్ అభిమానులు తమ హీరో రేంజ్‌ను చూసి మురిసిపోతున్నారు. త్వరలో ప్రభాస్ నుంచి రానున్న కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలు కూడా ఖచ్చితంగా భారీ వసూళ్లను రాబడతాయన్న దానిలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X