Adipurush: ప్రభాస్ సంచలన రికార్డు.. 468 కోట్లు ఏంటి సామీ.. టాలీవుడ్‌ చరిత్రలోనే తొలిసారిగా!

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీనికితోడు కొన్నేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అప్పటి నుంచి పంథాను మార్చుకున్న అతడు.. వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ 'ఆదిపురుష్' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడు ఓ సంచలన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఏంటా ఘనత? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

ఆదిపురుష్‌గా వస్తున్న ప్రభాస్:ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి మ్యూజిక్ ఇచ్చారు.

Prabhas Creates Sensational Record with Pre Release Business

యమ హైప్... బిజినెస్ భారీగా:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనిపై ఏర్పడ్డ హైప్ వల్ల థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 120 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక, మిగిలిన భాషలు, ఏరియాలను కలుపుకుని ఇది రూ. 430 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

బాహుబలి 2 నుంచి భారీగానే:ప్రభాస్ హీరోగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' మూవీపై ఆరంభం నుంచీ ఎలాంటి అంచనాలు ఉండేవే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలుపుకుని రూ. 122 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. ఫలితంగా టాలీవుడ్‌లో అప్పటి వరకూ ఉన్న రికార్డులను ఈ మూవీ బ్రేక్ చేసింది.

Prabhas Creates Sensational Record with Pre Release Business

సాహోకు కూడా ఆ రేంజ్‌లో:'బాహుబలి 2' తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయాడు. దీంతో అప్పుడు అతడు నటించిన 'సాహో' సినిమా లెవెల్ కూడా భారీగా పెరిగింది. ఫలితంగా ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలుపుకుని రూ. 121.60 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది. ఇది బాహుబలి 2 రికార్డును చేరకున్నా అందరినీ షాక్‌కు గురి చేసింది.

Prabhas Creates Sensational Record with Pre Release Business

రాధే శ్యామ్‌కు తగ్గిపోయింది:'సాహో' మూవీ భారీ అంచనాల నడుమ విడుదలై తెలుగులో పరాజయం పాలైంది. దీంతో ఆ తర్వాత ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీకి కాస్త డిమాండ్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలుపుకుని రూ. 105.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. కానీ, ఇందులో సగం కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది.

Prabhas Creates Sensational Record with Pre Release Business

468 కోట్లతో ప్రభాస్ సెన్సేషన్:'ఆదిపురుష్' మూవీకి కూడా రూ. 120 కోట్లకు అమ్ముడుపోవడంతో.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన గత నాలుగు చిత్రాలకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 468.80 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా ఇంత మొత్తంలో బిజినెస్ చేసిన ఏకైక హీరోగా ప్రభాస్ సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు. తద్వారా టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X