100 కోట్లు వదులుకుంటు రిస్క్ చేస్తున్న ప్రభాస్.. మారుతి సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

రెబల్ స్టార్ క్రేజ్ నుంచి ఇప్పుడు పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ తదుపరి సినిమాలతో మాత్రం మరింత ఎక్కువ స్థాయిలో సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం లైనప్ లో ప్రభాస్ డిఫరెంట్ సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు ను వీలైనంత తక్కువ బడ్జెట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే ఆ సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ ను పక్కన పెట్టి ఒక ప్రణాళిక వేసినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా మొత్తం బడ్జెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

రెండు సినిమాలతో ఎదురుదెబ్బ

రెండు సినిమాలతో ఎదురుదెబ్బ

బాహుబలి సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ప్రభాస్ ఇంతవరకు ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు. సాహో సినిమా పెట్టిన పెట్టుబడిన వెనక్కి తీసుకువచ్చినప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ ను సైతం ఆ సినిమా సంతృప్తి పరచలేకపోయింది. ఇక రాధే శ్యామ్ కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా అయితే కమర్షియల్ గా కూడా బాక్సాఫీస్ వద్ద భావిస్థాయిలో నష్టాలను కలిగించింది.

మళ్ళీ సక్సెస్ ట్రాక్ అందుకొని..

మళ్ళీ సక్సెస్ ట్రాక్ అందుకొని..

అందుకే ప్రభాస్ తన తదుపరి సినిమాతో మాత్రం ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ అందుకొని ఫ్యాన్స్ ని కూడా హ్యాపీ చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సలార్ తో పాటు ప్రాజెక్ట్ K సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

మారుతితో హారర్ మూవీ

మారుతితో హారర్ మూవీ

ప్రభాస్ సలార్ సినిమా తర్వాతనే మారుతి సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైపోయింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ అయితే హారర్ బ్యాక్ డ్రాప్ లో ఒక డిఫరెంట్ కామెడీ జానర్ లో వచ్చే అవకాశం ఉందట. ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంటుంది అని ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

100 కోట్లు తీసుకోవడం లేదట

100 కోట్లు తీసుకోవడం లేదట

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాకు ప్రభాస్ ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే యువి క్రియేషన్స్ కు చెందిన ప్రభాస్ స్నేహితులకూడా అందులో భాగస్వాములుగా ఉన్నారు అని తెలుస్తోంది. అయితే దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకునే ప్రభాస్ ఇప్పుడు మాత్రం ఈ సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదట.

మొత్తం బడ్జెట్ ఎంతంటే?

మొత్తం బడ్జెట్ ఎంతంటే?

పైగా సినిమా బడ్జెట్ను కూడా చాలా తక్కువకి డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా కాకుండా వీలైనంతవరకూ 100 కోట్లు దాటానివ్వకుండా సినిమా చేయాలి అని ప్రభాస్ గత ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. రాధే శ్యామ్ అలా అనుకొని స్టార్ట్ చేసిందే కానీ ఆ తర్వాత ప్రణాళికలు మారిపోయాయి. కానీ ఈసారి మారుతి ఫుల్ కంట్రోల్లోకి తీసుకొని ప్రభాస్ అనుకున్నట్లుగానే వీలైనంత తక్కువ బడ్జెట్ లోనే సినిమాను ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. మొత్తం 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలా లాభాల్లో వాటా వచ్చేలా..

అలా లాభాల్లో వాటా వచ్చేలా..

ఇక ప్రభాస్ రెమ్యునరేషన్ ముందు కూడా లేదు కాబట్టి సినిమా బిజినెస్ తర్వాత లాభాల్లో వాటా అందుకునే విధంగా నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. తప్పకుండా సినిమా నాన్ థియేట్రికల్ గానే 100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుంది కాబట్టి ప్రభాస్ ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ తప్పకుండా వెనక్కి వస్తుంది. ఇక సినిమా థియేట్రికల్ గా సక్సెస్ అయితే లాభాల్లో మరికొంత వాటా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X