4000 కోట్ల టార్గెట్‌పై గురిపెట్టిన ప్రభాస్.. ఇండస్ట్రీలో ఏ హీరోకు దక్కని బిజినెస్ రేర్ రికార్డ్
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర హీరోలు, స్టార్ యాక్టర్లందరూ అచీతూచి జాగ్రత్తగా సినిమాలను చేసుకొంటూ వెళ్తున్నారు. బడా హీరోలు ఏడాదికో, లేదా రెండేళ్లకోసారి ఓ సినిమా చేసేందుకు ఇష్టపడుతున్నట్టు వారు చేస్తున్న ప్రాజెక్టులు చూస్తే అర్ధమవుతుంది. అయితే ఇండస్ట్రీలో ఇతర హీరోలకు భిన్నంగా రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో నిత్యం బిజీగా మారిపోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా చేతిలో ఐదారు సినిమాలతో రెడీగా ఉన్నారు. ఆ సినిమాల బిజినెస్ మాత్రం భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకు లేని విధంగా ఉందనే టాక్ వినిపిస్తున్నది. ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఏంటి? ఆయన సినిమాల బిజినెస్ ఎన్ని కోట్లనే వివరాల్లోకి వెళితే...
ప్రభాస్ ప్రస్తుతం పట్టాలెక్కించిన సినిమాల జాబితా వివరాల్లోకి వెళితే.. దర్శకుడు మారుతితో ది రాజా సాబ్, హను రాఘవపూడి కలయికతో ఫౌజీ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగతో కలిసి స్పిరిట్, నాగ్ అశ్విన్‌తో కలిసి కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్ చిత్రం సంక్రాంతి పండుగకు రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. ఫౌజీ ఆ తర్వాత విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ ఐదు సినిమాల బిజినెస్ భారీగా జరుగుతున్నదనే విషయం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ది రాజా సాబ్, ఫౌజీ బిజినెస్
మారుతి దర్శకత్వం వహిస్తున్న ది రాజా సాబ్ చిత్రం బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 350 కోట్ల నుంచి 400 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా రేంజ్, స్పాన్ తక్కువగా ఉండటంతో బిజినెస్ కూడా మీడియం రేంజ్‌లో జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫౌజీ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ చిత్రం 500 నుంచి 550 కోట్ల మధ్య జరుగుతున్నది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సలార్ 2 థియేట్రికల్ బిజినెస్
ఇక సలార్ 2 సినిమా విషయానికి వస్తే.. సలార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ వస్తున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారుగా 620 కోట్ల రూపాయలు రాబట్టిందని ట్రేడ్ రిపోర్ట్. దాంతో ఈ సినిమా రెండో పార్ట్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ సుమారుగా 850 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
స్పిరిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంచనా
వరుస విజయాలతో ఊపు మీద ఉన్న ప్రభాస్‌తో యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ తన స్పిరిట్ మూవీ కోసం జత కలిశాడు. దాంతో అంచనాలే కాకుండా బిజినెస్ వర్గాల్లో లెక్కలు ఓ స్థాయిని మించి పెరిగిపోయాయి. ఈ సినిమా బిజినెస్‌పై రోజు రోజుకు లెక్కలు మారుతున్నాయి. యానిమల్ సినిమా సుమారుగా 950 కోట్ల రూపాయలు వసూలు చేయడంతో ఈ సినిమా బిజినెస్ ఊహకు అందని విధంగా జరుగుతున్నది. ఈ చిత్రం సుమారుగా 1000 కోట్లకుపైగానే ఉంటుందని లెక్క కడుతున్నారు.
కల్కి 2 మూవీ బిజినెస్ ఏ రేంజ్‌లో అంటే?
ఇదిలా ఉండగా, కల్కి 2 సినిమా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ దాదాపు 1050 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దాంతో ఈ సినిమా బిజినెస్ 1200 కోట్ల మేర జరగవచ్చని అంచనాలు వేస్తున్నారు. దాంతో ఈ ఐదు సినిమాల బిజినెస్ మొత్తంగా 4000 కోట్ల మేర బిజినెస్ జరుగుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ రేంజ్‌లో ఏ హీరోకు కూడా ఈ రేంజ్ బిజినెస్ జరిగే ఛాన్సే దరిదాపులో కనిపించడం లేదు అని ట్రేడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.


Click it and Unblock the Notifications











