Kalki 1st Weekend Collections 600 కోట్లకు చేరువగా కల్కి.. చరిత్ర సృష్టించిన ప్రభాస్ మూవీ!
కల్కి చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరును కొనసాగిస్తూనే ఉంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్, దిశా పటానీ తదితరులు నటించిన ఈ చిత్రం వసూళ్ల సునామీని మరిపిస్తున్నది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి మహనటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తొలి వారాంతం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి చిత్రం తొలి రోజు నుంచి రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో పలు భాషల్లో రూపొందిన ఈ చిత్రం తొలి రోజు 95 కోట్ల రూపాయలు, రెండో రోజు 58 కోట్లు, మూడో రోజు 64.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 214 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక 4వ రోజు ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కర్ణాటక, మలయాళ భాషల్లో భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగులో 39 కోట్ల రూపాయలు, తమిళంలో 5.5 కోట్ల రూపాయలు, హిందీలో 39 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4వ రోజు భారీ వసూళ్లు రాబట్టింది. ఆదివారం సెలవు దినం కావడంతో తొలి రోజుకు సమానంగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఇండియాలో 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఓవర్సీస్‌లో కల్కి మూవీకి ఎదురే లేకుండా పోతున్నది. అమెరికా, కెనడాలో 11 మిలియన్లు అంటే.. 92 కోట్ల రూపాయలు, యూకేలో 900K పౌండ్లు అంటే 10 కోట్ల రూపాయలు, ఆస్ట్రేలియాలో 1.6 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే 9 కోట్ల రూపాయలు, న్యూజిలాండ్‌లో 1.8 లక్షల డాలర్లు అంటే 1 కోటి రూపాయలు, జర్మనీలో 1.4 లక్షల యూరోలు అంటే.. భారతీయ కరెన్సీలో 1.3 కోట్ల రూాపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మొత్తంగా 112 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇండియాలో అన్ని భాషల్లో కలిపి కల్కి చిత్రం 296 కోట్లు నికరంగా కలెక్షన్లు రాబట్టింది. నాలుగు రోజుల్లో హిందీలో 105 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 124 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 112 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 550 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 5వ రోజు ఈ మూవీ 600 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











