Kalki 2898 AD చరిత్ర సృష్టించనున్న కల్కి ఓటీటీ డీల్.. బాలీవుడ్ స్టార్ హీరోల మూవీ బడ్జెట్‌ మించి రేట్!

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్ K అలియాస్ కల్కి 2898 AD (Kalki 2898 AD) చిత్రం విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తున్నది. సైంటిఫిక్ ఫిక్షన్‌గా పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండ్ దీపిక పదుకోన్ లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తుండటంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ రేట్ విషయంలోకి వెళితే..

కల్కి సినిమాను అత్యంత సాంకేతికతతో అధునిక టెక్నాలజీతో వీఎఫ్ఎక్స్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా లెజెండరీ యాక్లర్లు, ఇండియాలోనే టాప్ యాక్టర్లు నటిస్తుండటంతో వారి రెమ్యునరేషన్లే భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా రెమ్యురనేషన్లు సుమారుగా 150 కోట్ల రూపాయలుగా, అలాగే వీఎఫ్ఎక్స్ కోసం 125 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లకుపైగానే ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Prabhas Kalki 2898 AD movie might get 200 Crore deal for OTT Rights

వాస్తవానికి ఈ సినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో విడుదల వాయిదా పడొచ్చని తెలుస్తున్నది. ఈ సినిమా జూన్ తర్వాత గానీ.. దసరాకు గానీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు భారీగా బిజినెస్ నమోదు అవుతున్నట్టు తాజా సమాచారం.

కల్కి సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేస్తుండటంతో ఓటీటీ, డిజిటల్ రైట్స్‌కు భారీ రేటు పలుకుతున్నది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ సంస్థ 200 కోట్ల రూపాయలు చెల్లించేందుకు రెడీగా ఉంది. కానీ ఇంకా ఓటీటీ రైట్స్ డీల్ పూర్తి కాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా బిజినెస్ నమోదు కావొచ్చని తెలియజేస్తున్నారు.

Prabhas Kalki 2898 AD movie might get 200 Crore deal for OTT Rights

కల్కి సినిమా కనుక ఈ రేంజ్ ఓటీటీ రైట్స్ ధర పలికితే ఇండియాలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ రికార్డుగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అత్యధిక ఓటీటీ డీల్ సొంతం చేసుకొన్న సినిమాగానే కాకుండా ప్రభాస్ మార్కెట్‌ను పెంచే రేంజ్ కూడా పెరుగుతుంది. బాలీవుడ్ హీరోలను తలదన్నే బిజినెస్ నమోదు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ హక్కులను సొంతం చేసుకొనేందుకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డీస్నీ+హాట్ స్టార్ పోటీ పడుతున్నాయి.

ఒకవేళ కల్కి 2898 ఏడీ సినిమాకు 200 కోట్లకుపైగా ఓటీటీ డీల్ జరిగితే.. బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ కంటే ఎక్కువ. ఇటీవల 900 కోట్లు వసూలు చేసిన యానిమల్ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు ఎక్కువ అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బిజినెస్ పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డులు రాస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X