ప్రభాస్ లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్.. ఆ రికార్డ్స్‌ను రాజాసాబ్ బ్రేక్ చేస్తుందా?

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas)హీరోగా నటించిన ఫాంటసీ హారర్ కామెడీ ది రాజాసాబ్ (The Raja Saab) విడుదలకు సిద్దమైంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ జనవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. బాహుబలి తర్వాత ఎక్కువగా సీరియస్, మాస్ పాత్రల్లో కనిపించిన ప్రభాస్ ను ఈ సినిమాలో కామెడీ, రొమాంటిక్ షేడ్‌లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనుకోని కారణాలతో సినిమా రిలీజ్ ఆలస్యం కావడం, ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్ల బజ్ కొంత తగ్గిందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ గత సినిమాలు బాక్సాఫీస్‌లో సెట్ చేసిన రికార్డులను 'ది రాజా సాబ్' బ్రేక్ చేయగలదా? అనేది హాట్ టాఫిక్ గా మారింది. ముందుగా ప్రభాస్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్‌పై ఓ లుక్కేద్దాం.

ముందుగా 2024లో వచ్చిన కల్కి (Kalki 2898 AD). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1,200 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రభాస్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్ షేర్ దాదాపు రూ.489-రూ 539 కోట్ల వరకు చేరి, ఈ సినిమాను డెఫినిట్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టింది. ప్రభాస్ మార్కెట్ ను వర్డల్ వైల్డ్ పెంచేసింది. దానికి ముందు వచ్చిన సలార్ (Salaar: Part 1 - Ceasefire) కూడా భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్లింది. వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ. 730 కోట్ల గ్రాస్, దాదాపు రూ. 337 కోట్ల షేర్ వసూలు చేసింది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లోనూ ప్రభాస్‌ తన సత్తా చాటారు.

Prabhas Last 5 Movies Box Office Collections Can The Raja Saab Break These Records

ఇక ఆదిపురుష్ (Adipurush).. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినప్పటికీ, భారీ బడ్జెట్ కారణంగా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు. షేర్ కేవలం రూ.197 కోట్లకే పరిమితమవడంతో ప్రభాస్ కెరీర్ లో డిజాస్టర్‌గా మారింది. ఇక 2022లో రాధే శ్యామ్ (Radhe Shyam) పరిస్థితి మరింత దారుణం.సుమారు రూ. 214 కోట్ల గ్రాస్, రూ. 86 కోట్ల షేర్ మాత్రమే రాబట్టిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

ఇవన్నీ కాకుండా 2019లో వచ్చిన సాహో( Saaho)కూడా భారీ ఓపెనింగ్స్ సాధించింది. వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ. 470 కోట్ల గ్రాస్, రూ. 232 కోట్ల షేర్ సాధించింది ఈ సినిమా. తెలుగులో అవరేజ్‌గా నిలిచినా.. హిందీ మార్కెట్‌లో మాత్రం మంచి వసూళ్లు సాధించి ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్‌కు బలపరిచింది.

ఈ లెక్కలన్నింటిని పరిశీలిస్తే... అత్యధిక వసూలు సాధించిన కల్కి 2898 AD (రూ. 1,200 కోట్లు) ని 'ది రాజా సాబ్' బ్రేక్ చేయడమంటే చాలా కష్టమే అని చెప్పాలి. ఇక సలార్ రేంజ్ (రూ700 కోట్లు) కూడా హారర్ కామెడీ జానర్‌కు పెద్ద టార్గెటే.. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ఆదిపురుష్ లేదా సాహో స్థాయి కలెక్షన్స్ కు చేరువైతే.. ట్రేడ్ వర్గాల పరంగా భారీ విజయమే అవుతుంది.

అయితే.. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, 'ది రాజా సాబ్'కి ఓపెనింగ్స్ డీసెంట్‌గా వచ్చే అవకాశం ఉన్నా, ప్రభాస్ లాస్ట్ ఫిలిమ్స్ సెట్ చేసిన భారీ బెంచ్‌మార్క్‌లను ఇది క్రాస్ చేయడం కష్టమేనని భావిస్తున్నారు. అయితే సినిమా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండి, కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ మాత్రం ఉంది. చూడాలి.. 'ది రాజా సాబ్' ప్రభాస్ కెరీర్‌లో మరో భారీ బాక్సాఫీస్ రికార్డ్ సెట్ చేస్తుందా? లేక డీసెంట్ హిట్‌తో సరిపెట్టుకుంటుందా? అన్నది జనవరి 9 తర్వాతే తెలుస్తుంది. మరో రకంగా చెప్పాలంటే.. రాజాసాబ్ మూవీ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాకు మరో కీలక పరీక్ష గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X