ప్రభాస్ ‘మిర్చి’కి రూ.40 కోట్ల కలెక్షన్... ఇందువల్లేనా?
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. తాజాగా ఈచిత్రం తొలి 17 రోజుల్లో రూ. 40 కోట్లుకుపైగా కలెక్షన్స్ సాధించింది. సినిమా విడుదలైన తొలి నాళ్లలో ఈ చిత్రానికి మిక్స్‌డ్ వచ్చింది. ఇప్పటికే వెండితెరపై వచ్చిన పలు సినిమాలను మేళవించి, పాత ఫాక్షన్ కథనే కాస్త అటు ఇటుగా తీసారనే విమర్శలు క్రిటిక్స్ నుంచి వచ్చాయి.
అయితే ప్రభాస్ పెర్ఫార్మెన్స్, ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమాలోని ఎంటర్ టైన్మెంట్ పాళ్లు, పాటలు తదితర అంశాలు ఈ చిత్రాన్ని విజయవంతమైన సినిమా నిలబెట్టాయని, మిర్చి సినిమాకు పోటీగా ఆ సయమంలో ఆ స్థాయి సినిమాలు పోటీలో లేక పోవడం మిర్చి విజయానికి మరో కారణంగా చెప్పవచ్చు అని ట్రేడ్ వర్గాల టాక్. నాయక్, SVSC సినిమాలు ఉన్నా అవి అప్పటికే నెల రోజులు పూర్తి చేసుకోవడంతో 'మిర్చి'కి పోటీ ఇవ్వలేక పోయాయి.
ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ 'మిర్చి' చిత్రం ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా, హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ఈచిత్రం వరల్డ్ వైడ్ గా పలు సెంటర్లలో మంచి కలెక్షన్లతో సాగుతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
గడిచిన 17 రోజుల్లో(ఆదివారం వరకు) నైజాం, సీడెడ్ ఏరియాల నుంచి మిర్చి చిత్రం ఇప్పటి వరకు రూ. 16 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇతర ఏరియాల్లో 18 కోట్ల వరకు వసూలు చేసినట్లు అంచనా. యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఈచిత్రం రూ. 3.36 కోట్లు ($6,22,807) వసూలు చేసింది. కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో కూడా మంచి కలెక్షన్స్ సాధించడంతో టోటల్ గా ఈ చిత్రం రూ. 40 కోట్ల వసూళ్లును అధిగమించింది. త్వరలోనే ఈచిత్రం రూ. 50 కోట్లు వసూలు చేస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications











