Mr Perfect Advance Booking: జోష్ పెంచిన Mr పర్‌ఫెక్ట్ అడ్వాన్స్ బుకింగ్.. ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం Mr ఫర్‌ఫెక్ట్. రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను తదితరులు నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయం అందుకొన్నది. దశరథ్ దర్వకత్వంలో వచ్చినలవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ప్రస్తుతం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా విడుదలైన ఈ ట్రైలర్, అలాగే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాలనే లక్ష్యంతో రీ రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలో మురళీ మోహన్, రావు రమేష్, నాజర్, ప్రకాశ్ రాజ్, సాయాజీ షిండే, కే విశ్వనాథ్, బ్రహ్మనందం, ప్రగతి తదితరులు నటించారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ డ్రామాకు విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫిని, మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్, దేవీ శ్రీ ప్రసాద్ సంగీత అందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

కుటుంబ, ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీకి సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ విషయానికి వస్తే.. ఆధునిక భావాలు, ఇండిపెండెంట్ బిహేవియర్ ఉన్న యువకుడిగా ప్రభాస్ కనిపించారు. ఈ జనరేషన్ యాటిట్యూడ్‌కు తగినట్టే అప్పట్లోనే ప్రభాస్ క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంతో ఈ తరం వారికి కూడా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నది.
Mr ఫర్‌ఫెక్ట్ ట్రైలర్‌లో ప్రభాస్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, స్టయిల్, స్వాగ్, ఎప్పుడూ లేని విధంగా న్యూ లుక్ ఆకట్టుకొనే అంశాలుగా కనిపించాయి. కాజల్, తాప్సీతో రొమాంటిక్ సీన్లు, అలాగే ఇద్దరు హీరోయిన్లతో కెమిస్ట్రీ తెర మీద యూత్‌కు గిలిగింతలు పెట్లేలా ఉందనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ అంన్ని వర్గాలను ఆకట్టుకొనేలా ఉన్నాయి. దశరథ్ టేకింగ్, దిల్ రాజు నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయనే చెప్పాలి.

ప్రభాస్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ అవుతున్న Mr ఫర్‌ఫెక్ట్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ జోరుగా ఊపందుకొంటున్నది. ఈ సినిమాకు పలు చోట్ల ఫాస్ట్ ఫిల్లింగ్ అవ్వడం రెబల్ స్టార్‌కు ఉన్న క్రేజ్‌ను తెలియజెప్పుతున్నది. హైదరాబాద్‌లో దేవీ, సంధ్య, సంధ్య 70ఎంఎంలో హౌస్‌ఫుల్ మోడ్‌లో జోష్ కనిపిస్తున్నది. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











