Salaar: ప్రభాస్ సంచలనం... బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన సలార్
రెబల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సలార్. ఇక ఈ సినిమాకు కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకోగా... సలార్ అర్ధరాత్రి నుంచే థియేటర్‌లోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. ఇదిలా ఉంటే అమెరికాలో బహుబలి 2 రికార్డును సలార్ బ్రేక్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల తర్వాత అంతటి ఎలివేషన్స్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. ఇక ఈ మూవీలో ప్రభాస్ తో పాటు.. మరో హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించాడు. శృతి హాసన్, జగపతిబాబు కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. ఇక ఈ సినిమా ఎట్టేకలకు పాన్ ఇండియా లెవెల్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది.

అర్ధరాత్రి నుంచే అన్ని థియేటర్లలో సలారోడు సందడి చేస్తుంది. మంచి పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ బాహుబలి రికార్డ్స్ అని రాసుకున్నాం... ఇకపై సలార్ రికార్డ్స్ అని రాసుకోవాలి అని ప్రభాస్ ప్యాన్స్ అంటున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సలార్ రికార్డులు బద్దలు కొట్టుడు ఖాయమని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా పీక్స్ లో ఉన్నాయని నెట్టింట ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో 100 మందితో ప్రభాస్ ఫైట్ అదరగొట్టాడు అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత సరైన పవర్ ఫుల్ సినిమా కోసం ఎదురుచూశామని.. ఆ లోటును సలార్ తీర్చిందని టాక్. అయితే ఇదిలా ఉంటే.. సలార్ సినిమా బహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. అమెరికాలో బాహుబలి 2 ఓపెనింగ్‌ని సలార్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సలార్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ 100 కోట్ల రూపాయలకు పైగా సాధించిందని తెలుస్తోంది. ఇక ఈ మొదటి రోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు రానున్నాయని అంఛనా. ఇక అమెరికాలో బహుబలి 2 ఓపెనింగ్ రికార్డును బ్రేక్ చేసింది సలార్. ఉత్తర అమెరికాలో, బాహుబలి 2 ప్రీమియర్ 2.45 మిలియన్ల డాలర్లను వసూలు చేయగా... ఇప్పటివరకు, RRRతో రాజమౌళి మాత్రమే 3.46 మిలియన్ల డాలర్లను వసూలు చేయగలిగాడు.

ఇప్పుడు సలార్ నార్త్ అమెరికా ప్రీమియర్లు 2.5మిలియన్ల డాలర్స్ దాటాయి. దీంతో బహుబలి 2 ప్రిమియర్లను 2.45 మిలియన్ డాలర్స్ కాగా.. సలార్.. బహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేసింది. అయితే బహుబలి ప్రీమియర్ రికార్డును బ్రేక్ చేసినప్పటికీ... ఓపెనింగ్ డే వసూళ్లను బ్రేక్ చేయలేదని తెలుస్తోంది. బహుబలి ఓపెనింగ్ డే కలెక్షన్లు 4.6 మిలియన్స్ డాలర్స్ కాగా.. ప్రభాస్ సలార్ 4మిలియన్స్ మాత్రమే రానున్నట్లు ట్రెడ్ వర్గాల సమాచారం. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











