Salaar Re Release Day 1 Collection: రీ రిలీజ్‌లో సలార్‌కు రికార్డ్ ఓపెనింగ్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాయి. తొలిసారి రిలీజైనప్పటి కంటే ఇంకా ఎక్కువగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ఈ విషయంలో సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. తాజాగా కేజీఎఫ్ ఫేస్ ప్రశాంత్ నీల్ - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ పార్ట్ 1ను రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చూడాలి.
కేజీఎఫ్, కాంతార లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన హోంబలే బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్. క్రిస్మస్ కానుకగా 2023 డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. కన్నడలో ఘన విజయం సాధించిన ఉగ్రం సినిమా అధారంగా తెరకెక్కించిన సలార్ చిత్రాన్ని సుమారుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

ప్రశాంత్ నీల్ టేకింగ్ , ప్రభాస్ బ్రాండ్‌కు తోడు ఈ సినిమా టీజర్, ట్రైలర్స్‌కు మంచి క్రేజ్, బజ్ క్రియేట్ కావడంతో రికార్డు స్థాయిలో 350 కోట్ల రూపాయల బిజినెస్ చేసి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 144 కోట్ల రూపాయలు.. తమిళనాడు థియేట్రికల్ హక్కులను 12 కోట్లకు, కర్ణాటక హక్కులు 30 కోట్లు, కేరళ 6 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల హక్కులు 82 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ హక్కులు 75 కోట్ల మేర అమ్ముడు పోయాయి.
తొలి రోజు ఏకంగా రూ.160 కోట్ల ఓపెనింగ్స్‌తో ప్రభాస్ మాస్ తాండవం చేశాడు. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 624.4 కోట్ల వసూళ్లు సాధించింది. తద్వారా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో సలార్ 5వ స్థానంలో నిలిచింది. రెండేళ్లు గడుస్తున్న సలార్ ఫీవర్ ప్రేక్షకులను ఊపేస్తూనే ఉంది. దీనిలో భాగంగా సలార్ పార్ట్ 1ను మార్చి 21వ తేదీన రీ రిలీజ్ చేయగా.. ఇప్పుడు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.1.46 కోట్ల గ్రాస్ అందుకున్న సలార్‌కు దాదాపు 1.15 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. నైజాంలో 68 లక్షలు, ఆంధ్రలో 59 లక్షలు, కర్ణాటకలో 19 లక్షల మేర అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొత్తంగా రీ రిలీజ్‌లో తొలిరోజు రూ.3.24 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రభాస్ సంచలనం సృష్టించాడు. శని, ఆదివారాలు కలిసి రావడంతో సలార్ మాస్ జాతర ఓ రేంజ్‌లో ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ప్రభాస్ ఎలాంటి మేజిక్ చేస్తాడో?


Click it and Unblock the Notifications











