Radhe Shyam 10 Days Collections: ఆదివారం నమ్మలేని వసూళ్లు.. రావాల్సింది 204 కోట్లు.. వచ్చిందింతే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ పేరు ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను కూడా సంపాదించుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ మధ్య కాలంలో భారీ చిత్రాల్లోనే నటిస్తోన్న ప్రభాస్.. ఇటీవలే 'రాధే శ్యామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ దక్కింది. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపిస్తోంది. ఫలితంగా ఈ మూవీకి వసూళ్లు అంతగా రావట్లేదు. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' మూవీ 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్

ప్రభాస్ - రాధాకృష్ణ కుమార్‌ కలయికలో రూపొందిన రొమాంటిక్ మూవీనే ‘రాధే శ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను చేశాడు. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు చాలా ప్రాంతాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో ‘రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ సమాచారం.

10వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

10వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

ఏపీ, తెలంగాణలో 10వ రోజూ ‘రాధే శ్యామ్' మూవీకి నిరాశే ఎదురైంది. దీంతో నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 10వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 49 లక్షలు షేర్‌తో పాటు రూ. 80 లక్షలు గ్రాస్ వచ్చింది.

10 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

10 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

‘రాధే శ్యామ్'కు 10 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 24.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.42 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.83 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.31 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.31 కోట్లు, గుంటూరులో రూ. 4.47 కోట్లు, కృష్ణాలో రూ. 2.66 కోట్లు, నెల్లూరులో రూ. 2.13 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 53.82 కోట్లు షేర్, రూ. 84 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

పది రోజుల్లో ఏపీ, తెలంగాణలో ‘రాధే శ్యామ్'కు రూ. 53.82 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 4.22 కోట్లు, తమిళనాడులో రూ. 78 లక్షలు, కేరళలో రూ. 18 లక్షలు, హిందీలో రూ. 10.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.66 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.34 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 82.25 కోట్లు షేర్‌తో పాటు రూ. 149 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 82.25 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 121.75 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

Recommended Video

SS Thaman About Prabhas..Radhe Shyam అబ్బాయిలకంటే అమ్మాయిలకి బాగా ఎక్కుతుంది | Filmibeat Telugu
ఆదివారం ఇలా.. భారీ నష్టాల దిశగా

ఆదివారం ఇలా.. భారీ నష్టాల దిశగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్' మూవీకి ఆదివారం కూడా దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. వీకెండ్‌లో ఊహించని విధంగా ఇంత తగ్గిపోవడంతో ట్రేడ్ పండితులే షాక్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు ఈ చిత్రం రాబట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఇది నష్టాలను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X