Radhe Shyam 11 Days Collections: 11వ రోజు మరీ దారుణం.. అన్ని కోట్ల నష్టాల దిశగా రాధే శ్యామ్

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో పాన్ ఇండియా మూవీలు కూడా ఎన్నో రూపొందుతున్నాయి. వాటిలో ఎక్కువ శాతం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నవే ఉన్నాయి. ఇందులో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'రాధే శ్యామ్'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పరచుకుంది.

దీంతో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుని రెండు వారాల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, దీనికి ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ దక్కింది. దీంతో కలెక్షన్లు చప్పగా వస్తున్నాయి. మరీ 'రాధే శ్యామ్' 11 రోజుల్లో ఎంత రాబట్టింది? ఇంకెత వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

ప్రభాస్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా

ప్రభాస్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ తీసిన చిత్రమే ‘రాధే శ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను చేశాడు. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం సమకూర్చాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

తెలుగు హీరోనే అయినా ప్రభాస్‌కు చాలా ప్రాంతాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో ‘రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ జరిగింది.

11వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

11వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

ఏపీ, తెలంగాణలో 11వ రోజూ ‘రాధే శ్యామ్' మూవీకి భారీ దెబ్బ తగిలింది. దీంతో నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 11వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 15 లక్షలు షేర్‌తో పాటు రూ. 25 లక్షలు గ్రాస్ వచ్చింది.

10 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

10 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

‘రాధే శ్యామ్'కు 11 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 24.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.44 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.86 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.33 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.32 కోట్లు, గుంటూరులో రూ. 4.48 కోట్లు, కృష్ణాలో రూ. 2.67 కోట్లు, నెల్లూరులో రూ. 2.14 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 53.97 కోట్లు షేర్, రూ. 84.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

11 రోజుల్లో ఏపీ, తెలంగాణలో ‘రాధే శ్యామ్'కు రూ. 53.97 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 4.22 కోట్లు, తమిళనాడులో రూ. 78 లక్షలు, కేరళలో రూ. 18 లక్షలు, హిందీలో రూ. 10.45 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.67 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.37 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 82.64 కోట్లు షేర్‌తో పాటు రూ. 150.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Recommended Video

Thaman On Radhe Shyam BGM : జస్టిన్ పాటల్ని వాడుకున్నా అంతే .. క్రెడిట్ అతనికే | Filmibeat Telugu
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

‘రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 82.64 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 121.36 కోట్లు వస్తే ఇది హిట్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దీనికి వంద కోట్లకు పైగా నష్టాలు తప్పలే కనిపించడంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X