Radhe Shyam 13 Days Collections: ప్రభాస్‌కు దెబ్బ మీద దెబ్బ.. 120 కోట్లు ఏంటి సామీ.. ఇంత దారుణమా!

టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లుగా పేరు సంపాదించుకున్నారు. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పలు చిత్రాల ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు సైతం చేరువ అయ్యాడు. ఈ ఉత్సాహంతోనే అతడు మరిన్ని సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ స్టార్ హీరో 'రాధే శ్యామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే గ్రాండ్‌గా విడుదలైంది. కానీ, దీనికి మంచి స్పందన దక్కడం లేదు. దీంతో ప్రభాస్‌కు ప్రతిరోజూ దెబ్బ పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 13 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

‘రాధే శ్యామ్‌' ప్రభాస్ సందడితో

‘రాధే శ్యామ్‌' ప్రభాస్ సందడితో

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ తీసిన చిత్రమే 'రాధే శ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను చేశాడు. జస్టిన్ ప్రభాకరణ్ దీనికి సంగీతం అందించాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్


టాలీవుడ్ స్టార్ అయిన ప్రభాస్‌కు చాలా ప్రాంతాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ జరిగింది.

13వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

13వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రాధే శ్యామ్' మూవీకి ఆరంభంలోనే భారీ రెస్పాన్స్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. ఇక, మొదటి వీకెండ్ తర్వాత నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోతూ వచ్చాయి. దీంతో ప్రభాస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 13వ రోజు కేవలం రూ. 4 లక్షలు షేర్, 7 లక్షలు గ్రాస్ వచ్చింది.

13 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

13 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు


'రాధే శ్యామ్'కు 13 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 24.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.88 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.34 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.32 కోట్లు, గుంటూరులో రూ. 4.49 కోట్లు, కృష్ణాలో రూ. 2.69 కోట్లు, నెల్లూరులో రూ. 2.14 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 54.09 కోట్లు షేర్, రూ. 84.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

13 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'రాధే శ్యామ్'కు రూ. 54.09 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 4.22 కోట్లు, తమిళనాడులో రూ. 78 లక్షలు, కేరళలో రూ. 18 లక్షలు, హిందీలో రూ. 10.65 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.68 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.40 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.00 కోట్లు షేర్‌తో పాటు రూ. 151 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 83 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 121 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X