Radhe Shyam 1st Week Collections: ఏడో రోజు సగమే.. 204 కోట్లకు అమ్మితే.. వారంలో వచ్చింది ఇంతే!

తెలుగు రాష్ట్రాల్లోనే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురు చూసిన చిత్రాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. దీనికి కారణం ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించడమే. అందుకే ఈ మూవీ ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా అత్యధికంగా చేసుకుని గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, 'రాధే శ్యామ్'కు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ ప్రభావం కలెక్షన్లపై చూపించింది. దీంతో మొదటి రోజు నుంచే దీనికి అనుకున్న రీతిలో వసూళ్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో అసలు మొదటి వారంలో ప్రభాస్ సినిమా ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

‘రాధే శ్యామ్’ అంటూ వచ్చేశాడు

‘రాధే శ్యామ్’ అంటూ వచ్చేశాడు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - రాధాకృష్ణ కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీనే ‘రాధే శ్యామ్'. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను పోషించాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

ప్రభాస్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో ‘రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు వ్యాపారం జరిగింది.

7వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

7వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

‘రాధే శ్యామ్' మూవీకి ఏపీ, తెలంగాణలో 7వ రోజూ కలెక్షన్లు తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 7వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 32 లక్షలు షేర్‌తో పాటు రూ. 50 లక్షలు గ్రాస్ వచ్చింది.

ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల రిపోర్టు

ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల రిపోర్టు

‘రాధే శ్యామ్'కు మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 24.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.68 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.19 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.23 కోట్లు, గుంటూరులో రూ. 4.37 కోట్లు, కృష్ణాలో రూ. 2.59 కోట్లు, నెల్లూరులో రూ. 2.09 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 52.59 కోట్లు షేర్, రూ. 82 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

వారం రోజుల్లో ఏపీ, తెలంగాణలో ‘రాధే శ్యామ్'కు రూ. 52.59 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 4.18 కోట్లు, తమిళనాడులో రూ. 75 లక్షలు, కేరళలో రూ. 18 లక్షలు, హిందీలో రూ. 8.95 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.58 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.13 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా వారంలో రూ. 79.36 కోట్లు షేర్‌తో పాటు రూ. 142.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


క్రేజీ కాంబోలో వచ్చిన ‘రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.36 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 124.64 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

Recommended Video

Watch Thaman Reaction After Girl Said I Love You | Radhe Shyam Team | Filmibeat Telugu
ఇలా అయితే భారీ డిజాస్టర్‌గానే

ఇలా అయితే భారీ డిజాస్టర్‌గానే

ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్' మూవీ కలెక్షన్లు రోజురోజుకూ మరింతగా పడిపోతున్నాయి. ఫలితంగా ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఇంకా ఈ సినిమా 120 కోట్లకు పైగా రాబట్టాలి. పైగా, 25 నుంచి RRR మూవీ రాబోతుంది. రెండో వారం పుంజుకోని పక్షంలో ప్రభాస్ సినిమా టాలీవుడ్‌లోనే బిగ్ డిజాస్టర్‌గా మారే ప్రమాదం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X