Radhe Shyam 2 Days Collections: 2 రోజు ఊహించని విధంగా.. అప్పుడే అన్ని కోట్లు.. పవన్ రికార్డు సేఫ్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు రెబెల్ స్టార్ ప్రభాస్. దీంతో అప్పటి నుంచి అన్నీ భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రాధే శ్యామ్' అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించాడు.

Recommended Video

Radhe Shyam : Rebel Star Prabhas Interacts With Media Live | Filmibeat Telugu

విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, దీనికి ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. కానీ, కలెక్షన్లు మాత్రం పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

రాధే శ్యామ్‌ అంటూ వచ్చిన ప్రభాస్

రాధే శ్యామ్‌ అంటూ వచ్చిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీనే 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రలో నటించాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ చేసింది.

2వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

2వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

'రాధే శ్యామ్' మూవీ ఏపీ తెలంగాణలో 2వ రోజు బాగా రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 6.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.24 కోట్లు, ఈస్ట్‌లో రూ. 61 లక్షలు, వెస్ట్‌లో రూ. 46 లక్షలు, గుంటూరులో రూ. 72 లక్షలు, కృష్ణాలో రూ. 71 లక్షలు, నెల్లూరులో రూ. 43 లక్షలతో.. 2వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 12.32 కోట్లు షేర్, రూ. 20.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

2 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

'రాధే శ్యామ్'కు 2 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 17.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.19 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.21 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.47 కోట్లు, గుంటూరులో రూ. 3.32 కోట్లు, కృష్ణాలో రూ. 1.66 కోట్లు, నెల్లూరులో రూ. 1.51 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 37.81 కోట్లు షేర్, రూ. 57.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

2 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 'రాధే శ్యామ్'కు రూ.37.81 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 3.04 కోట్లు, తమిళనాడులో రూ. 48 లక్షలు, కేరళలో రూ. 10 లక్షలు, హిందీలో రూ. 4.45 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లోనే రూ. 56.39 కోట్లు షేర్‌తో పాటు రూ. 97.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిందీ మూవీ.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 56.39 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 147.61 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

ఓవరాల్‌గా నాలుగో స్థానం సొంతం

ఓవరాల్‌గా నాలుగో స్థానం సొంతం

'రాధే శ్యామ్' మూవీకి ఆశించిన రీతిలో టాక్ రాకున్నా రెండో రోజు ఈ సినిమా బాగానే రాబట్టింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంది. కానీ, నాలుగో స్థానానికే పరిమితమైంది. రెండో రోజు ఏపీ, తెలంగాణలో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలో బాహుబలి (14.80 కోట్లు), పుష్ప (13.70 కోట్లు), భీమ్లా నాయక్ (13.14 కోట్లు) దీనికంటే ముందున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X