Radhe Shyam 5 Days Collections: రాధే శ్యామ్‌కు ఊహించని షాక్.. ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి భారీ దెబ్బ

బాహుబలి మూవీ తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక, అక్కడి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుసగా భారీ ప్రాజెక్టులనే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రభాస్ 'రాధే శ్యామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కడం లేదు. దీంతో నిరాశజనకమైన కలెక్షన్లే వస్తున్నాయి. ఇదే ఐదో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' మూవీ 5 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది? అనేవి చూద్దాం పదండి!

రాధే శ్యామ్ అంటూ వచ్చిన ప్రభాస్

రాధే శ్యామ్ అంటూ వచ్చిన ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీనే ‘రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రలో కనిపించాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్


ప్రభాస్‌కు ఆంధ్రా, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో ‘రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ అయింది.

5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

‘రాధే శ్యామ్' మూవీ ఏపీ, తెలంగాణలో 5వ రోజూ నిరాశ పరిచింది. దీంతో నైజాంలో రూ. 53 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. మంగళవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.14 కోట్లు షేర్, రూ. 1.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

5 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

‘రాధే శ్యామ్'కు 5 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 23.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.58 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.11 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.17 కోట్లు, గుంటూరులో రూ. 4.30 కోట్లు, కృష్ణాలో రూ. 2.54 కోట్లు, నెల్లూరులో రూ. 2.05 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 51.64 కోట్లు షేర్, రూ. 80.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో ‘రాధే శ్యామ్'కు రూ. 51.64 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 4.15 కోట్లు, తమిళనాడులో రూ. 71 లక్షలు, కేరళలో రూ. 16 లక్షలు, హిందీలో రూ. 8 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.02 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లోనే రూ. 77.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 138 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 77.20 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 126.80 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

Recommended Video

Radhe Shyam లో Prabhas కి ఉండే వరమే .. ఆఖరికి శాపంలా మారుతుంది | Filmibeat Telugu
ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారి ఇలా

ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారి ఇలా

‘రాధే శ్యామ్' మూవీకి ఆశించిన రీతిలో టాక్ రాలేదు. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా నిరాశ పరుస్తున్నాయి. దీంతో ఈ చిత్రానికి ఐదు రోజుల్లో కేవలం 77.20 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇది ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన పరిస్థితి అని విశ్లేషకులు అంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే ఘోర పరాభవం చవి చూడాల్సి వస్తుందని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X