Radhe Shyam 6 Days Collections: ప్రభాస్ చెత్త రికార్డు.. అఖండ, పుష్ప 11.. రాధే శ్యామ్ 5 మాత్రమే
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. 'ఈశ్వర్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇలా సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించాడు. ఈ క్రమంలోనే రాజమౌళి తీసిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి పంథాను మార్చుకుని భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'రాధే శ్యామ్' అనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఎవరూ ఊహించనంత బజ్‌తో విడుదలైన ఈ మూవీ కష్టాలను ఎదుర్కొంటోంది. ఫలితంగా దారుణమైన వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' మూవీ 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రభాస్
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీనే ‘రాధే శ్యామ్'. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్
ఆంధ్రా, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో ప్రభాస్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో ‘రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ జరిగింది.

6వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
‘రాధే శ్యామ్' మూవీ ఏపీ, తెలంగాణలో 6వ రోజు భారీ షాక్ తగిలింది. దీంతో నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. 6వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 63 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

6 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు
6 రోజుల్లోనూ ‘రాధే శ్యామ్'కు తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 24.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.64 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.16 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.21 కోట్లు, గుంటూరులో రూ. 4.35 కోట్లు, కృష్ణాలో రూ. 2.59 కోట్లు, నెల్లూరులో రూ. 2.08 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 52.27 కోట్లు షేర్, రూ. 81.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
6 రోజుల్లో ఏపీ, తెలంగాణలో ‘రాధే శ్యామ్'కు రూ. 52.27 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 4.18 కోట్లు, తమిళనాడులో రూ. 73 లక్షలు, కేరళలో రూ. 17 లక్షలు, హిందీలో రూ. 8.40 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.10 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 78.40 కోట్లు షేర్‌తో పాటు రూ. 140.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
భారీ బడ్జెట్‌తో వచ్చిన ‘రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 78.40 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 125.60 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.
Recommended Video


అఖండ, పుష్ప 11.. రాధే శ్యామ్ 5
ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్' మూవీ కలెక్షన్లు రోజురోజుకూ దారుణంగా పడిపోతున్నాయి. ఫలితంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులే కోటి రూపాయల కంటే ఎక్కువ షేర్‌ను రాబట్టింది. దీంతో ప్రభాస్ ఖాతాలో చెత్త రికార్డు వచ్చి చేరింది. అంతకు ముందు అఖండ, పుష్ప 11 రోజులు కోటి పైగా వసూలు చేశాయి. భీమ్లా నాయక్ కూడా ఆరు రోజుల పాటు కోటి రూపాయలు లాగింది.


Click it and Unblock the Notifications











