twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe Shyam 8 Days Collections: ప్రభాస్‌కు కోలుకోలేని షాక్.. రాధే శ్యామ్ ఆ చరిత్రను తిరగరాస్తుందా!

    |

    కెరీర్ ఆరంభం నుంచి చాలా కాలం పాటు తెలుగు సినిమాలను మాత్రమే చేసినా.. 'బాహుబలి' నుంచి పంథాను మార్చుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ సినిమాతో తన మార్కెట్‌ను కూడా దేశ వ్యాప్తంగా విస్తరించుకున్న అతడు.. ఆ వెంటనే వచ్చిన 'సాహో'తో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి పాన్ ఇండియా మూవీలనే చేస్తున్నాడు. ఇలా ఇటీవలే ప్రభాస్ 'రాధే శ్యామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు దెబ్బ కొడుతున్నాయి. దీంతో భారీ నష్టాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' 8 రోజుల కలెక్షన్లను చూద్దాం పదండి!

    ‘రాధే శ్యామ్'తో వచ్చిన ప్రభాస్

    ‘రాధే శ్యామ్'తో వచ్చిన ప్రభాస్

    రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీనే 'రాధే శ్యామ్'. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

    Bigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిBigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

    ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

    ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

    ఏపీ, తెలంగాణతో పాటు చాలా ప్రాంతాల్లో ప్రభాస్‌కు భారీ మార్కెట్ ఉంది. దీంతో 'రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ అయింది.

     8వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    8వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    ఏపీ, తెలంగాణలో 8వ రోజూ 'రాధే శ్యామ్' మూవీకి కలెక్షన్లు తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 8వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 40 లక్షలు షేర్‌తో పాటు రూ. 65 లక్షలు గ్రాస్ వచ్చింది.

    శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!

    8 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    8 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    'రాధే శ్యామ్'కు 8 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 24.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.73 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.23 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.26 కోట్లు, గుంటూరులో రూ. 4.40 కోట్లు, కృష్ణాలో రూ. 2.61 కోట్లు, నెల్లూరులో రూ. 2.10 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 52.99 కోట్లు షేర్, రూ. 82.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ఎనిమిది రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'రాధే శ్యామ్'కు రూ. 52.99 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 4.18 కోట్లు, తమిళనాడులో రూ. 76 లక్షలు, కేరళలో రూ. 18 లక్షలు, హిందీలో రూ. 9.95 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.20 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 80.26 కోట్లు షేర్‌తో పాటు రూ. 144 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

    డోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చడోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చ

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 80.26 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 123.74 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

    ఆ చరిత్రను తిరగరాస్తుందా!

    ఆ చరిత్రను తిరగరాస్తుందా!

    ప్రభాస్ తాజా చిత్రం 'రాధే శ్యామ్' మూవీ కలెక్షన్లు రోజురోజుకూ మరింతగా పడిపోతున్నాయి. ఫలితంగా ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఇంకా ఈ సినిమా 120 కోట్లకు పైగా రాబట్టాలి. పైగా, 25 నుంచి RRR మూవీ రాబోతుంది. రెండో వారం పుంజుకోని పక్షంలో ప్రభాస్ సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది.

    English summary
    Prabhas Did Radhe Shyam Movie Under Radha Krishna Kumar Direction. This Movie Collects Rs 80.26 Cr in 8 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X