Radheshyam Non Theatrical Bussiness: విడుదల అవ్వకముందే నిర్మాతలు సేఫ్.. లాభం ఎంతంటే?
రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా గత రెండేళ్ల నుంచి ఫ్యాన్స్ ను ఎంతగానో ఉరిస్తోంది. కొన్నిసార్లు షూటింగ్స్ కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా మరికొన్ని సార్లు కరోనా కారణంగా రిలీజ్ డేట్లు వాయిదా పడుతున్నాయి. ఇక సినిమాకి సంబంధించిన బిజినెస్ డీల్స్ అయితే భారీగానే ఉన్నాయి. ప్రభాస్ రేంజ్ కొంచెం కూడా తగ్గలేదు అని మరోసారి రాధేశ్యామ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక గత సినిమాల కంటే ఎక్కువ స్థాయిలో రాధేశ్యామ్ ఆ రూట్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ ఇమేజ్ తోనే..
జిల్ సినిమా అనంతరం దర్శకుడు రాధాకృష్ణ ప్రభాస్ కు సింగిల్ సిట్టింగ్ లోనే రాధేశ్యామ్ కథను చెప్పి ఒప్పించాడు. ఈ సినిమా విషయంలో యూవీ క్రియేషన్స్ ఆలోచించిన విధంగా అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నప్పటికీ కొన్నిసార్లు ప్రమోషన్ విషయంలో మాత్రం ప్లాన్స్ తేడా కొట్టేశాయి. సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. కేవలం ప్రభాస్ ఇమేజ్ తోనే సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది.

నిర్మాతలు సేఫ్ అవ్వడంతో
రాధేశ్యామ్ సినిమాను మొదట 100కోట్ల బడ్జెట్ లోనే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ బాహుబలి అనంతరం డార్లింగ్ రేంజ్ పాన్ ఇండియా రేంజ్ లో నెంబర్ వన్ గా మార్చింది. ఇక సాహో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా నార్త్ లో సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. మొత్తానికి నిర్మాతలు సేఫ్ అవ్వడంతో రాధేశ్యామ్ కోసం కూడా భారీగానే ఖర్చు చేశారు.

భారీ బడ్జెట్..
ఇక థియేటర్స్ లో సినిమా ఏ స్థాయిలో వసూళ్లను సాధిస్తుందో తెలియదు గాని మొత్తానికి నాన్ థియేట్రికల్ గా అయితే పెట్టిన పెట్టుబడులకు భారీగా లాభాలను అందించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా 250కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

ఆల్ టైమ్ రికార్డ్స్
ముందుగా గతంలో ప్రభాస్ సినిమాల నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలను పరిశీలిస్తే.. బాహుబలి 1 డిజిటల్ ఓటీటీ శాటిలైట్ హక్కుల రూపంలో 60కోట్ల ధర పలుకగా బాహుబలి 2, 150కోట్లు అందుకుంది. సాహో సినిమాకి అంతేకంటే ఎక్కువగా 240కోట్లు వచ్చాయి. అన్ని సినిమాలు కూడా ఆల్ టైమ్ రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయని చెప్పవచ్చు.
Recommended Video

రాధేశ్యామ్ హక్కులు ఎంతంటే?
ఇక రాధేశ్యామ్ సినిమాకు అత్యధికంగా 250కోట్లకు డిజిటల్ ఓటీటీ శాటిలైట్ హక్కుల అమ్ముడైనట్లు సమాచారం. అంటే నాన్ థియేట్రికల్ గానే సినిమా పెట్టిన బడ్జెట్ ను దాదాపు వెనక్కి తెచ్చినట్లు చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ హిందీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకోగా.. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ హక్కులను జీ 5 దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ అయితే అంచనాలను గట్టిగానే పెంచుతున్నాయి. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. మార్చి 11వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











