twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe Shyam Total Collections: 204 కోట్లకు అమ్మితే వచ్చిందింతే.. చరిత్రలోనే ప్రభాస్ చెత్త రికార్డు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ బడా హీరోగా వెలుగొందుతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో మోస్తరు బడ్జెట్ చిత్రాలకు మాత్రమే పరిమితం అయిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో తన రేంజ్‌ను అమాంతం పెంచుకున్నాడు. అప్పటి నుంచి భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'రాధే శ్యామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశాజనకమైన కలెక్షన్లనే రాబట్టింది. ఫలితంగా భారీ స్థాయిలో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

    ‘రాధే శ్యామ్‌'గా వచ్చేసిన ప్రభాస్

    ‘రాధే శ్యామ్‌'గా వచ్చేసిన ప్రభాస్

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ తీసిన చిత్రమే 'రాధే శ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను చేశాడు. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం సమకూర్చాడు.

    బెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మబెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ

    ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

    ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

    పేరుకు తెలుగు హీరోనే అయినా ప్రభాస్‌కు చాలా ప్రాంతాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ అయింది.

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది

    'రాధే శ్యామ్'కు ఫుల్ రన్‌లో తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 24.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.90 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.34 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.32 కోట్లు, గుంటూరులో రూ. 4.50 కోట్లు, కృష్ణాలో రూ. 2.71 కోట్లు, నెల్లూరులో రూ. 2.14 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 54.17 కోట్లు షేర్, రూ. 84.58 కోట్లు గ్రాస్ వచ్చింది.

    బెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మబెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ఫుల్ రన్‌లో ఏపీ, తెలంగాణలో 'రాధే శ్యామ్'కు రూ. 54.17 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 4.25 కోట్లు, తమిళనాడులో రూ. 78 లక్షలు, కేరళలో రూ. 18 లక్షలు, హిందీలో రూ. 10.68 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.69 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.45 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 151.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంత?

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.20 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 120.80 కోట్లు వెనకబడి ఉంది.

    జిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకంజిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకం

    టాలీవుడ్‌లోనే ప్రభాస్ చెత్త రికార్డు

    టాలీవుడ్‌లోనే ప్రభాస్ చెత్త రికార్డు

    తెలుగు సినీ చరిత్రలోనే ఎక్కువ నష్టాలను ఎదుర్కొని డిజాస్టర్లుగా మిగిలిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి', మహేశ్ బాబు 'స్పైడర్' మూవీలు రూ. 60 కోట్లకు పైగా నష్టాలతో ఒకటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు వాటికి ఏమాత్రం అందనంత దూరంలో ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీ రూ. 120 కోట్ల నష్టాలతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

     ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీగా

    ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీగా

    రెబెల్ స్టార్ ప్రభాస్ - రాధాకృష్ణ కుమార్ కాంబోలో వచ్చిన 'రాధే శ్యామ్' మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు సదరు సంస్థ సోమవారమే ఓ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ఈ సినిమా నెల కూడా తిరగక ముందే ఓటీటీలోకి వస్తుండడంతో ప్రభాస్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

    English summary
    Prabhas Did Radhe Shyam Movie Under Radha Krishna Kumar Direction. This Movie Collects Rs 83.20 Cr in Full Run.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X