Radhe Shyam: అఖండ రికార్డు బ్రేక్ చేయని రాధే శ్యామ్.. ఓవరాల్‌గా మూడో స్థానంలో ప్రభాస్ మూవీ
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుని పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభం నుంచి తెలుగు సినిమాలకే పరిమితం అయిన అతడు.. బాహుబలి నుంచి పంథాను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే భారీ చిత్రాల్లో నటిస్తూ తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు.
చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ 'రాధే శ్యామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీంతో విడుదలకు ముందే ఇది ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ మూవీ గురించి షాకింగ్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

రాధే శ్యామ్‌గా రెడీ అయిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీనే ‘రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు.

అంచనాలు పెంచేసిన అప్‌డేట్లు
షూటింగ్ మొదలైన చాలా కాలం వరకూ ‘రాధే శ్యామ్' అప్‌డేట్లు అంతగా రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. ఆ తర్వాత పాటలను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి.

భారీ బిజినెస్.. హాట్ కేకుల్లా రైట్స్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘రాధే శ్యామ్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రూ. 202.80 కోట్లకు అమ్ముడయ్యాయని తెలిసింది.

రాధే శ్యామ్ థియేటర్ల వివరాలు
భారీగా రాబోతున్న రాధే శ్యామ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తక్కువ థియేటర్లలోనే విడుదల కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం.. నైజాంలో 365, సీడెడ్‌లో 190, ఉత్తరాంధ్రలో 78, ఈస్ట్ గోదావరిలో 56, వెస్ట్ గోదావరిలో 61, గుంటూరులో 60, కృష్ణాలో 60, నెల్లూరులో 42 థియేటర్లతో విడుదల కాబోతుంది. మొత్తం ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తంగా 876 థియేటర్లలో వస్తోంది.

మిగిలిన భాషల్లో ఎన్ని థియేటర్లు
‘రాధే శ్యామ్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక, దీన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 థియేటర్లలో, తమిళనాడులో 175, కర్నాటకలో 185, కేరళలో 150, హిందీ ప్లస్ రెస్టాప్ ఇండియాలో 2200, ఓవర్సీస్‌లో 3400 థియేటర్లలో తీసుకు వస్తున్నారు. మొత్తంగా 7010 థియేటర్లలో రాబోతుంది.

అఖండ రికార్డును దాటని శ్యామ్
ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అన్ని చోట్లా దీన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో రిలీజ్ చేయడం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన అఖండ 925, పుష్ప 1150, భీమ్లా నాయక్ 1075 థియేటర్లలో వచ్చాయి. అంటే అఖండను కూడా ఇది దాటలేదు.
Recommended Video

ఓవరాల్‌గా మూడో స్థానానికి చేరిక
ప్రపంచ వ్యాప్తంగా ‘రాధే శ్యామ్' మూవీ ఎంతో గ్రాండ్‌గా విడుదలవుతోంది. మొత్తంగా ఈ చిత్రం 7010 థియేటర్లలో రాబోతుంది. దీంతో ఎక్కువ థియేటర్లలో విడుదలవుతోన్న చిత్రాల జాబితాలో మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో బాహుబలి 2 (9000 థియేటర్లు), సాహో (7978 థియేటర్లు) ముందున్నాయి. వీటి తర్వాత సైరా 4632 థియేటర్లతో నాలుగో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications











