Adipurush: ప్రభాస్ ఫినామినల్ రికార్డు.. 1182 కోట్లు ఏంటి సామీ.. భారత సినీ చరిత్రలోనే తొలి హీరో
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. దాదాపు ఐదారేళ్లుగా దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా మనోడు వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ సౌత్ నుంచి నార్త్ వరకూ తన మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా భారీ చిత్రాలనే చేస్తున్నాడు.
ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రభాస్ 'ఆదిపురుష్' అనే పౌరాణిక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు మరో ఫినామినల్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఇండియాలోనే ఏకైక హీరోగా నిలిచాడు. ఆ సంగతులు మీరే చూడండి!

ఆదిపురుష్‌గా ప్రభాస్ సిద్ధం: పాన్ ఇండియా స్టార్ హీరో నటించిన తాజా చిత్రమే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీలో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ మ్యూజిక్ ఇచ్చారు.

ఫుల్ హైప్.. బిజినెస్ భారీగా: టెక్నికల్ వండర్‌గా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనిపై ఏర్పడ్డ హైప్ వల్ల థియేట్రికల్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 120 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, మిగిలిన వెర్షన్లను కలుపుకుని రూ. 240 కోట్లు వ్యాపారం అయింది.

బాహుబలి 1 మూవీకి ఇలా: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి 1'. ఆరంభంలో అంచనాలు భారీగా ఉండడంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఇది వరల్డ్ వైడ్‌గా రూ. 118 కోట్లు బిజినెస్ జరుపుకుంది. తద్వారా అప్పటి రికార్డులను బద్దలు కొట్టేసింది.

బాహుబలి 2కు రికార్డులతో: ఫస్ట్ పార్ట్ ఇండస్ట్రీ హిట్ అవడంతో 'బాహుబలి 2' మూవీపై వరల్డ్ వైడ్‌గా హైప్ భారీ స్థాయిలో క్రియేట్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కుల కోసం పోటీ రెట్టింపు అయిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, భాషలను కలుపుకుని ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూ. 352 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.

సాహోకు ఆ రేంజ్‌లోనే: 'బాహుబలి 2' సిరీస్‌తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో అప్పుడు అతడు నటించిన 'సాహో' సినిమా లెవెల్ కూడా భారీగా పెరిగింది. ఫలితంగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 270 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అప్పట్లో ఈ సినిమా అందరి దృష్టినీ లాగేసింది.
రాధే శ్యామ్‌కు తక్కువగా: 'సాహో' మూవీ భారీ అంచనాల నడుమ విడుదలై తెలుగులో అంతగా ఆడలేదు. దీంతో ఆ తర్వాత ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీకి కాస్త డిమాండ్ తగ్గిపోయిందనే చెప్పాలి. కానీ, వేరే భాషల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రాంతాలను కలుపుకుని రూ. 202.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

ఏకంగా రూ. 1182 కోట్లతో: 'ఆదిపురుష్' మూవీకి కూడా రూ. 240 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన గత ఐదు చిత్రాలకు కలిపి ఏకంగా రూ. 1182.80 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా ఇంత మొత్తంలో బిజినెస్ చేసిన ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు. ఈ నెంబర్సే అతడి రేంజ్‌ను చాటి చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











