Kalki 2898 AD: 1428 కోట్లతో ప్రభాస్ ఊచకోత.. తొలి ఇండియన్ హీరోగా సంచలన రికార్డు

టాలీవుడ్‌ నుంచి హీరోగా పరిచయమైనా.. దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకుని పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో రెబెల్ స్టార్ తాజాగా ఓ సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

కల్కిగా రాబోతున్న ప్రభాస్
తెలుగు హీరో ప్రభాస్ నటించిన భారీ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.

Prabhas Reaches 1428 Crore Pre Release Business with Last 5 Movies

ఫుల్ హైప్.. బిజినెస్ భారీగా

'కల్కి 2898 ఏడీ' మూవీపై అంచనాలు భారీ స్థాయాలో నెలకొన్నాయి. దీనిపై ఏర్పడ్డ హైప్ వల్ల థియేట్రికల్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 168 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, మిగిలిన వెర్షన్లను కలుపుకుని రూ. 370 కోట్లు వ్యాపారం అయింది.

Prabhas Reaches 1428 Crore Pre Release Business with Last 5 Movies

సాహోకు భారీ బిజినెస్
'బాహుబలి 2' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దీంతో అప్పుడు అతడు నటించిన 'సాహో' సినిమా లెవెల్ కూడా భారీగా పెరిగింది. ఫలితంగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 270 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుని సత్తా చాటుకుంది.

Prabhas Reaches 1428 Crore Pre Release Business with Last 5 Movies

రాధే శ్యామ్‌కు తక్కువగా

ప్రభాస్ నటించిన 'సాహో' మూవీ ఎన్నో అంచనాలతో వచ్చినా తెలుగులో పెద్దగా ఆడలేదు. దీంతో ఆ తర్వాత ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీకి కాస్త డిమాండ్ తగ్గిపోయింది. కానీ, వేరే భాషల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రాంతాలను కలుపుకుని రూ. 203.00 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను మాత్రమే చేసుకుంది.

ఆదిపురుష్ మూవీకి అలా
'బాహుబలి 2' తర్వాత సక్సెస్ అందుకోకున్నా ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రానికి మాత్రం భారీ హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, భాషలను కలుపుకుని రూ. 240 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుని సత్తా చాటుకుంది.

Prabhas Reaches 1428 Crore Pre Release Business with Last 5 Movies

సలార్‌కు మరింతగానే

ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీపై అంచనాలు భారీ స్థాయాలో నెలకొన్నాయి. దీనిపై ఏర్పడ్డ హైప్ వల్ల థియేట్రికల్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 120 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, వెర్షన్లను కలుపుకుని రూ. 345 కోట్లు వ్యాపారం చేసింది.

Prabhas Reaches 1428 Crore Pre Release Business with Last 5 Movies

1428 కోట్లతో సంచలనం
'కల్కి 2898 ఏడీ' మూవీకి రికార్డు స్థాయిలో రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన గత ఐదు చిత్రాలకు కలిపి ఏకంగా రూ. 1428 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా భారత సినీ చరిత్రలోనే ఇంత మొత్తంలో బిజినెస్ చేసిన ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ సంచలన రికార్డును నమోదు చేసుకుని చరిత్రను సృష్టించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X