ప్రభాస్ ‘రెబల్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రెబల్' చిత్రం విడుదలైన నిన్నటితో వారం రోజులు పూర్తి చేసుకుంది. యావరేజ్ టాక్‌లోనూ ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించడం గమనార్హం. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో కలిపి తొలి వారం దాదాపు రూ. 33.35 కోట్ల నెట్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది.
ఏరియావైజ్ గా కలెక్షన్ల వివరాలు
నైజాం - రూ. 11 కోట్లు
సీడెడ్ - రూ. 5.5 కోట్లు
గుంటూరు - రూ. 3.6 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 3.25 కోట్లు
ఈస్ట్ గోదావరి - రూ. 2.65 కోట్లు
వెస్ట్ గోదావరి - రూ. 2 కోట్లు
కృష్ణ - రూ. 1.55 కోట్లు
నెల్లూరు - రూ. 1.1 కోట్లు
కర్ణాటక - రూ. 1.25 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - రూ. 90 లక్షలు
యూఎస్ఏ - రూ. 60 లక్షలు
ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











