For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యావరేజ్ టాక్ లోనూ ‘రెబల్’ ఫెంటాస్టిక్ (3డేస్) కలెక్షన్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యావరేజ్ టాక్ లోనూ రెబల్ చిత్రం ఫెంటాస్టిక్ కలెక్షన్స్ కురిపిస్తోంది. ప్రభాస్ సినిమాలకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కు తోడు, ఆయన గత చిత్రాలు డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాలు మంచి విజయం సాధించడమే ఇందుకు కారణం. 'రెబల్'చిత్రం తొలి 3 రోజుల్లో మంచి కలెక్షన్లు సాధించింది. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ పెనింగ్స్ సాధించిన చిత్రంగా 'రెబల్' నిలిచింది.

    నైజాం ఏరియాలో 'రెబల్' చిత్రం దాదాపు 250కిపైగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తొలి మూడు రోజుల్లో 'రెబల్' చిత్రం ఇక్కడ దాదాపు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. అదే విధంగా సీడెడ్ ఏరియాలో రూ. 3.60 కోట్లు రాబట్టింది.

    గుంటూరు, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి ఏరియాల్లోనూ ప్రభాస్ కు మంచి పాలోయింగ్ ఉంది. ఈచిత్రం గుంటూరులో రూ. 1.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.56 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.49 కోట్లు వసూలు చేసింది. అదే విధంగా వెస్ట్ గోదావరిలో రూ. 1.3 కోట్లు, కృష్ణలో రూ. 1.05 కోట్లు, నెల్లూరులో రూ. 78 లక్షలు చొప్పున తొలి మూడు రోజుల్లో వసూలు చేసింది.

    అదే విధంగా ఏపి బయట కూడా 'రెబల్' చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కర్నాటకలో ఈచిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 1.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 75 లక్షలు, యూఎస్ఏలో రూ. 85 లక్షలు వసూలు చేసింది. టోటల్ గా ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 23.32 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

    ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

    English summary
    Prabhas' much-hyped movie Rebel has concluded the first weekend with superb collections at the Box Office in India. This film is the biggest opener in the career of this young Telugu actor. It has erased all his previous collection records and set its own new bench mark in the domestic business centres. The film has raked in Rs 23.32 crores nett at the worldwide Box Office in the first weekend. It is the highest collection for a flick of Prabhas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X