Radhe shyam కొట్టిన దెబ్బకి రెమ్యునరేషన్ తో సెటిల్మెంట్స్ చేస్తున్న ప్రభాస్.. గ్రేట్ హీరో!
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత బాక్సాఫీస్ వద్ద ఓ మంచి విజయాన్ని అందుకోవాలని ఎంతో ఇష్టంగా విడుదల చేసిన రెండు సినిమాలు కూడా నిరాశపరిచాయి. యూవీ క్రియేషన్స్ లో రూపొందిన సాహో అలాగే రాధే శ్యామ్ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకోవడంతో ప్రభాస్ అప్సెట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభాస్ తన సినిమా కారణంగా ఎవరు నష్టపోకూడదనే వీలైనంత వరకు పారితోషికం వెనక్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. ఇటీవల నిర్మాతలతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ తన రెమ్యునరేషన్ లో ఎంత వెనక్కి తిరిగి ఇస్తున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాతో బిగ్ స్టార్
రాజమౌళి దర్శకత్వంలో చేసిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాతో ప్రభాస్ ఎనలేని గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. బాహుబలి మొదటి భాగం 600 కోట్లు సాదించగా.. ఆ తర్వాత వచ్చిన రెండవ భాగం 18 వందల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవడంతో ప్రభాస్ స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. ఆ తరువాత అతనికి తిరుగు లేదని అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

ఆ కలెక్షన్స్ దగ్గరే ఆగిపోయింది.
సాహో సినిమా కనీసం హిందీలో అయినా పాజిటివ్ టాక్ ను అందుకుని పెట్టిన పెట్టుబడికి అక్కడ మాత్రమే మంచి లాభాలను అందించింది. కానీ రాధే శ్యామ్ సినిమా మాత్రం ఏ బాషలో కూడా పెట్టిన పెట్టుబడికి లాభాలను అందించలేకపోయింది. ఇక ఈ సినిమా కనీసం వంద కోట్ల కలెక్షన్స్ కూడా అందుకోక పోవడం ఆశ్చర్యం అని చెప్పాలి. ఇప్పటివరకు కేవలం 75కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఒక విధంగా ప్రభాస్ కెరీర్ లోనే రాధే శ్యామ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతలు సేఫ్ అయ్యారు.. కానీ..
ఇక రాధే శ్యామ్ సినిమా కోసం నిర్మాతలు దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ గానే నిర్మాతలకు నష్టం రాకుండా చేసింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మంచిగానే జరగడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారు. కానీ విడుదల అనంతరం సినిమాపై పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు మాత్రం దారుణంగా నష్టపోయారు.

నష్టపోయిన వారికి..
ప్రస్తుతం యు.వి.క్రియేషన్స్ అయితే భారీగా నష్టపోయిన బయ్యర్లకు ఎంతో కొంత డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముందుగానే ప్రభాస్ ఆ విషయంలో నిర్మాతలకు సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భారీగా నష్టపోయిన వారికి ఎంతోకొంత ఇవ్వాలి అని కూడా అన్నాడట. ఇక ప్రభాస్ తన పారితోషికంలో సగానికిపైగా వెనక్కి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

50కొట్లు వెనక్కి ఇచ్చేసిన ప్రభాస్
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన స్థాయి పెరిగి పోవడంతో ప్రభాస్ పారితోషికం 100 కోట్లకు పెరిగి పోయిన విషయం తెలిసిందే. ప్రతి సినిమాకు భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకు కూడా అదే తరహాలో అందుకున్నాడు.. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరచడంతో నిర్మాతలకు ప్రభాస్ యాభై కోట్ల వరకు వెనక్కి తిరిగి ఇచ్చేసి నష్టాలు వచ్చిన వారికి సెటిల్మెంట్ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











