For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Radhe Shyam: చిరంజీవి రికార్డును టచ్ చేయలేకపోయిన ప్రభాస్.. భీమ్లా నాయక్‌కు చాలా దూరంలోనే!

  |

  'రాధే శ్యామ్'.. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో బజ్‌ను ఏర్పరచుకుంది. దీనికి కారణం ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించడమే. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై అందరూ ఫోకస్ చేశారు. దీంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది. ఫలితంగా ఈ మూవీ ఈరోజే (మార్చి 11) గ్రాండ్‌గా విడుదల అవుతుంది. అన్ని చోట్లా దీనికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అయితే, 'రాధే శ్యామ్' మూవీకి యూఎస్‌లో మాత్రం నిరాశే ఎదురైంది. దీంతో ప్రభాస్ ఎన్నో రికార్డులను చేరకుండానే ఆగిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ సంగతులు మీకోసం!

  రాధే శ్యామ్‌గా వచ్చిన ప్రభాస్

  రాధే శ్యామ్‌గా వచ్చిన ప్రభాస్


  రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీనే 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను పోషించాడు.

  హాట్ షోలో గీత దాటిన సమంత: వీడియోలో అలా అందాలను ఆరబోస్తూ.. హాట్ హాట్‌గా!

  రికార్డులు బ్రేక్... బజ్ భారీగా

  రికార్డులు బ్రేక్... బజ్ భారీగా

  'రాధే శ్యామ్' మూవీ నుంచి ఆరంభం నుంచే అప్‌డేట్లు అంతగా రాలేదు. కానీ, కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి వరుసగా టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. ఆ తర్వాత పాటలు, ట్రైలర్‌లను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

  రికార్డు స్థాయిలో ప్రీ బిజినెస్

  రికార్డు స్థాయిలో ప్రీ బిజినెస్

  భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి స్పందన దక్కింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రూ. 202.80 కోట్లకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల టాక్.

  Bigg Boss Non Stop: సరయు రాయ్‌పై చెక్కతో దాడి.. ఆరియానా తప్పుకు ఆమె బలి.. బిగ్ బాస్ వార్నింగ్

  తెలుగులో మూడో స్థానంలో

  తెలుగులో మూడో స్థానంలో


  పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఇది తెలుగు రాష్ట్రాల్లో 900 థియేటర్లలో, తమిళనాడులో 175, కర్నాటకలో 185, కేరళలో 150, హిందీ రెస్టాప్ ఇండియాలో 2200, ఓవర్సీస్‌లో 3400 థియేటర్లలో కలిపి మొత్తంగా 7010 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇది టాలీవుడ్‌లోనే మూడో అత్యధిక రిలీజ్.

  అమెరికాలో మాత్రం నిరాశే

  అమెరికాలో మాత్రం నిరాశే

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అతడి సినిమా కోసం అన్ని ప్రాంతాల్లోని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. దీంతో 'రాధే శ్యామ్'కు కూడా భారీ స్పందన దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సినిమాకు అమెరికాలో ప్రీ సేల్ (అడ్వాన్స్ బుకింగ్స్) విషయంలో నిరాశే ఎదురైందని తెలుస్తోంది.

  హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!

  సైరాను దాటలేకపోయింది

  సైరాను దాటలేకపోయింది

  విడుదలకు ముందు 'రాధే శ్యామ్' అమెరికాలో మిలియన్ మార్క్‌ను టచ్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ మూవీ అమెరికాలో 670 లొకేషన్లలో 2113 షోలకు గానూ 25,784 టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఈ చిత్రం 542K డాలర్లను మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా 'సైరా నరసింహారెడ్డి' పేరిట ఉన్న 560k డాలర్ల రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.

  భీమ్లా నాయక్‌కు దూరంగా

  భీమ్లా నాయక్‌కు దూరంగా

  అమెరికాలో ప్రీ సేల్స్ విషయంలో ఇటీవలే విడుదలై 'భీమ్లా నాయక్' మూవీ సత్తా చాటింది. అక్కడ ఈ చిత్రం ఏకంగా 610k డాలర్లను వసూలు చేసింది. దీంతో పోల్చుకుంటే ప్రభాస్ సినిమా చాలా తక్కువగానే కలెక్ట్ చేసినట్లు అయింది. అంటే అమెరికాలో మాత్రం 'రాధే శ్యామ్' మూవీ పవన్ చిత్రానికి దగ్గరలోకి కూడా రాలేకపోయింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Prabhas Did Radhe Shyam Movie Under Radha Krishna Kumar Direction. Lets Know about This Movie USA pre sale Report.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X