twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్‌బాబు స్పైడర్‌‌ను టచ్ చేయలేకపోయిన సాహో.. ఓవర్సీస్ కలెక్షన్లు ఎంతంటే

    |

    బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకొంటున్నది. గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ముందుకు ప్రభాస్ వచ్చినప్పటికీ.. అంచనాలు చేరుకోలేకపోయారనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్ర ప్రపంచవ్యాప్తంగా 8 వేల థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉంటుందని ఆశించిన ట్రేడ్ వర్గాలను నిరాశపరిచే విధంగా వార్తలు వస్తున్నాయి. తొలి రోజున ఓవర్సీస్‌లో ప్రభావం చూపలేకపోయిందనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో తొలి రోజు ఎంత సంపాదించిందంటే.

    దేశవ్యాప్తంగా సాహోపై టాక్

    దేశవ్యాప్తంగా సాహోపై టాక్

    ఇక దేశవ్యాప్తంగా సాహో వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నాయి. కాకపోతే వారాంతం తర్వాత సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై ట్రేడ్ వర్గాలు అంచనాకు రాలేకపోతున్నాయి. సినిమా కథలో వేగం లేకుండా స్లోగా ఉందని, అనవసరమైన ట్విస్టులు సినిమాపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని సినీ విమర్శకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    భారీ సంఖ్యలో సాహో

    భారీ సంఖ్యలో సాహో

    నైజాంలో 450 థియేటర్లకుపైగా, ఆంధ్రాలో సుమారు 600 థియేట్లరు, సీడెడ్‌లో సుమారు 400 థియేటర్లకుపైగా సాహో విడులైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సుమారు 4500 పైగా థియేటర్లకుపైగా, ఓవర్సీస్‌లో 1100కుపైగా స్క్రీన్లలో రిలీజ్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సాహో 8 వేలకుపైగా స్క్రీన్లు, థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    ఓవర్సీస్‌లో స్పైడర్‌ను టచ్ చేయలేక

    ఓవర్సీస్‌లో స్పైడర్‌ను టచ్ చేయలేక

    సాహో చిత్రం ఓవర్సీస్‌లో అత్యధిక స్క్రీన్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రం దారుణంగా ఫ్లాప్‌ను కూడగట్టుకొన్న మహేష్ బాబు చిత్రం స్పైడర్‌ కలెక్షన్లను అధిగమించలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి రోజున స్పైడర్ చిత్రం 1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అయితే సాహో మాత్రం కేవలం $915,897 ( సుమారు Rs.6 కోట్లు) వసూలు చేసింది.

    తొలి రోజు కలెక్షన్ల అంచనా

    తొలి రోజు కలెక్షన్ల అంచనా

    సాహో హిందీ వెర్షన్‌కు సుమారు రూ.25 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపి తొలి రోజున రూ.35 కోట్లు, తమిళ, మలయాళ, కన్నడలో భారీ కలెక్షన్లు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. తొలి రోజున తమిళంలో రూ.15 కోట్లు, మలయాళంలో రూ.5 కోట్లు వరకు వసూళ్లు సాధించడానికి అవకాశం ఉంది.

    English summary
    After Bahubali the face of Telugu Cinema among all its linguistic counterparts in India has changed. It is not even exaggeration in saying Bahubali became the face of Indian Cinema in the world. Makers are now investing more time and money in Telugu cinema than they used to spend before Bahubali series smashed all the Indian box office records.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X