సాహో x అవెంజర్స్: ఫస్ట్‌డే కలెక్షన్స్ అంచనా: రికార్డు థియేటర్లు.. ప్రభాస్ ఎంత కుమ్మేస్తాడంటే..
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి రంగం సిద్ధమైంది. దాదాపు ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అనే టాక్‌ను రిలీజ్‌కు ముందే సొంతం చేసుకోవడంతో తొలి రోజు ఈ రేంజ్ కలెక్షన్లు వస్తాయనే విషయం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో చర్చనీయాంశమైంది. ఇక బాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఏ రేంజ్‌లో వసూళ్లు వస్తాయనే ఊహగానాలు రకరకాలుగా వినిపిస్తున్నాయి. సాహో తొలి రోజు కలెక్షన్లపై ట్రేడ్ అంచనాలు ఎలా ఉన్నాయంటే..

అవెంజర్స్, కబీర్ సింగ్ కంటే
బాలీవుడ్‌లో సాహో అడ్వాన్స్ బుకింగ్‌కు విశేష స్పందన లభిస్తున్నది. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, అవెంజర్స్: ఎండ్‌గేమ్, కబీర్ సింగ్ కంటే ఎక్కువగా అడ్వాన్స్ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. దాంతో హిందీ వెర్షన్‌కు సుమారు రూ.25 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షోకు హిట్ టాక్ వస్తే సాయంత్రం షోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

హిందీ రాష్ట్రాల్లో భారీగా
హిందీ ప్రాంతాలను చూసుకుంటే అన్ని ప్రాంతాల్లోను భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. బీహార్, మధ్య ప్రదేశ్, యూపీలో సాహోకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. తొలి ఆటకు హిట్ టాక్ వస్తే కలెక్షన్ల రేంజ్‌ను ఊహించడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తెలంగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య
ఇక తొలి రోజు రికార్డు కలెక్షన్లను రాబట్టడానికి థియేటర్లు, స్క్రీన్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి తర్వాత అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న చిత్రం సాహో ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నైజాంలో 450 థియేటర్లకుపైగా, ఆంధ్రాలో సుమారు 600 థియేట్లరు, సీడెడ్‌లో సుమారు 400 థియేటర్లలో సాహో రిలీజ్ అవుతున్నది.

దక్షిణాదిలో థియేటర్ల సంఖ్య
తెలుగేతర రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళలో సాహోకు ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ కనిపిస్తున్నది. ప్రేక్షకుల ఆదరణ దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో సుమారు 400 థియేటర్లలో, తమిళనాడులో 550 థియేటర్లలో, కేరళలో 200 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

ప్రపంచవాప్తంగా థియేటర్ల సంఖ్య
ఇక హిందీ రాష్ట్రాల్లో కూడా థియేటర్ల సంఖ్య తగ్గినట్టు కనిపించడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో సుమారు 4500 పైగా థియేటర్లలో సాహోను రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ థియేటర్ల సంఖ్య ఉండటం అభిమానుల్లో హుషారు పెంచుతున్నది. ఇక ఓవర్సీస్‌లో 1100కుపైగా స్క్రీన్లలో రిలీజ్ అవుతున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సాహో 8 వేలకుపైగా స్క్రీన్లు, థియేటర్లలో ప్రేక్షకులకు రంజింపచేయడానికి సిద్ధమైంది.

తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే..
ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల సంఖ్య భారీగా ఉండటంతో తొలి రోజు రికార్డులు తిరగరాసే కలెక్షన్లు ఉండటం ఖారారై పోయిందని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాహో చిత్రం సుమారు రూ.80 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఒకవేళ సినిమాపై పాజిటివ్ రిపోర్ట్స్ ఉంటే ఇంకా కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











