వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సాహో సంచలనం.. హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా కలెక్షన్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో రిలీజై వారం రోజులు పూర్తి చేసింది. గత వారం రోజుల్లో సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో సాహో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. బాలీవుడ్ నటులు శ్రద్దాకపూర్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే తదితరులు నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సాహో చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రెండో స్థానం నిలువగా.. రెండు గత 7 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రెండోస్థానంలో

వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రెండోస్థానంలో

సాహో చిత్రం నెగిటివ్ టాక్‌ను ఎదురించి ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రెండోస్థానంలో నిలువడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా హాబ్స్ అండ్ షా చిత్రం 45 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే.. సాహో చిత్రం 41 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మూడో స్థానంలో దిలైన్ కింగ్ 27 మిలియన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ 25 మిలియన్ డాలర్లు, ఏంజెల్ హాజ్ ఫాలెన్ చిత్రం 24 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు..

తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు..

తెలుగు రాష్ట్రాల్లో సాహో చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. నాలుగైదు రోజుల సెలవులను క్యాష్ చేసుకొన్న ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు రూ.1.44 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. నైజాంలో 62 లక్షలు, సీడెడ్‌లో 24 లక్షలు, ఉత్తరాంధ్రలో 22 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 లక్షలు, గుంటూరు 8 లక్షలు, కృష్ణా జిల్లాలో 7 లక్షలు, నెల్లూరులో 6 లక్షల రూపాయలు వసూలు చేసింది. సెలవుల తర్వాత సాహో మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయిందనే విషయాన్ని ట్రేడ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

ఏడు రోజుల్లో మొత్తంగా

ఏడు రోజుల్లో మొత్తంగా

తెలుగు రాష్ట్రాల్లో గత 7 రోజుల కలెక్షన్లను చూసుకొంటే.. మొత్తంగా సాహో రూ.74.92 కోట్లు వసూలు చేసింది. నైజాంలో ఈ చిత్రం రూ.27.08 కోట్లు, సీడెడ్ రూ.10.65 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.8.94 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 6.74 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5.41 కోట్లు, గుంటూరు 7.40 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.81 కోట్లు, నెల్లూరులో 3.89 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

దక్షిణాదిలో వసూళ్లు

దక్షిణాదిలో వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో సాహో ప్రభావం చూపలేకపోయింది. కర్ణాటకలో సాహో చిత్రం రూ.15.22 కోట్లు, తమిళంలో రూ.5 కోట్లు, కేరళలో రూ.1.32 కోట్లు వసూలు చేసింది. బ్యాడ్ రివ్యూలు సినిమాపై భారీ ప్రభావం చూపాయనే విషయం ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేశాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లో

ఉత్తరాది రాష్ట్రాల్లో

ఉత్తరాదిలోనే ఈ చిత్రం భారీగా వసూళ్లు నమోదు చేసింది. గత 7 రోజుల్లో ఈ చిత్రం116 కోట్ల నికరంగా వసూలు చేసింది శుక్రవారం. ఉత్తరాదిలో ఇంకా వసూళ్లు బాగానే నమోదు అవుతున్నాయి. శుక్రవారం రూ.24.4 కోట్లు, శనివారం రూ.25.2 కోట్లు, ఆదివారం రూ.29.48 కోట్లు, సోమవారం రూ.14.20 కోట్లు, మంగళవారం రూ.910 కోట్లు, బుధవారం రూ.6.90 కోట్లు, గురువారం రూ.6.75 కోట్లు వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో సాహో

ఓవర్సీస్‌లో సాహో

ఓవర్సీస్ మార్కెట్‌లో సాహో చిత్రం పెద్దగా సందడి చేయలేకపోయింది. యూఎస్, కెనడాలో కలిపి ఈ చిత్రం 11.96 కోట్లు వసూలు చేసింది. మిగితా దేశాల్లో ఈ చిత్రం 15.84 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X